Color psychology: మీ ఫేవరైట్ కలర్ ఏంటో చెప్పండి.. మీ పర్సనాలిటీ సీక్రెట్స్ మేం చెప్పేస్తాం..-know what your favorite color says about personality ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Color Psychology: మీ ఫేవరైట్ కలర్ ఏంటో చెప్పండి.. మీ పర్సనాలిటీ సీక్రెట్స్ మేం చెప్పేస్తాం..

Color psychology: మీ ఫేవరైట్ కలర్ ఏంటో చెప్పండి.. మీ పర్సనాలిటీ సీక్రెట్స్ మేం చెప్పేస్తాం..

Koutik Pranaya Sree HT Telugu
Jul 05, 2024 10:04 AM IST

Color psychology: మీకు ఇష్టమైన రంగు ద్వారా మీ గురించి చాలా విషయాలు గుర్తించవచ్చని మీకు తెలుసా? మీరు ఇష్టపడే రంగు మీ వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది.

రంగు బట్టి వ్యక్తిత్వం
రంగు బట్టి వ్యక్తిత్వం (Shutterstock)

ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలలో అతని వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉంటాయి. వాళ్లు ఎలాంటి వ్యక్తి, వ్యక్తిత్వం ఏమిటి, సమాజం, ప్రపంచం పట్ల వాళ్ల దృక్పథం ఏమిటి, ఎటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు? ఈ విషయాలన్నీ ఆ వ్యక్తి ఇష్టాల ద్వారా చాలావరకు తెలుసుకోవచ్చు. అదేవిధంగా, ఒక వ్యక్తికి ఇష్టమైన రంగు కూడా అతని వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో రంగంటే ఇష్టం ఉంటుంది. దాని ఆధారంగా, వాళ్ల వ్యక్తిత్వం గురించి చాలా చెప్పొచ్చు. మీకు ఇష్టమైన రంగు మీ గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం.

తెలుపు:

తెలుపు రంగును ఎక్కువగా ఇష్టపడే వారు ఆ రంగులాగే చాలా శాంతంగా ఉంటారు. వీరికి చాలా ఎక్కువ సహనం ఉంటుంది. ఎలాంటి వాతావరణాన్నైనా శాంతపరిచే శక్తి వీళ్లకి ఉంటుంది. తెలుపు రంగును ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు చాలా దయగలవారు. వివక్ష చూపకుండా, ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేసేలా ముందుంటారు. చాలా తక్కువగా మాట్లాడతారు. ఆలోచించి, ఆచీతూచీ మాట్లాడతారు.

నలుపు రంగు:

నలుపు ఇష్టపడే వారు చాలా సిగ్గుపడే స్వభావం కలిగి ఉంటారు. వీరిలో చాలా మంది జనాలకి దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. అలాగనీ ఎవరితో మాట్లాడని కాదు. అవసరమైనప్పుడు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తపర్చడంలో ముందుంటారు. వాళ్ల జీవితంలోని చాలా పేజీలను వాళ్లు రహస్యంగా దాచేస్తారు. అవసరమైన వాటిని మాత్రమే బయటపెడతారు. వాళ్ల దగ్గరి స్నేహితులకు కూడా ఆ రహస్యాలు తెలీవు.

ఆకుపచ్చ రంగు:

ఆకుపచ్చ రంగు ఇష్టపడే వాళ్లు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆనందమైన జీవితం గడపడానికి ఇష్టపడుతారు. వాళ్ల జీవితం మీద ఎవరు ఆంక్షలు పెట్టినా భరించలేరు. సమాజం పట్ల, వాళ్ల సంబంధాల పట్ల విదేయతతో ఉంటారు. కానీ వాళ్ల జీవితంలో స్వేచ్ఛను బాగా ఇష్టపడతారు.

ఎరుపు రంగు:

వీళ్లు కూడా స్వేచ్ఛగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.అపరిచితులను కూడా స్నేహితుల్లాగా మార్చేసుకుంటారు. కొత్త సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. వీళ్లు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎంతదాకా అయినా వెళతారు. పట్టు వదలరు.

నీలం రంగు:

నీలం రంగును ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు చాలా విశ్వసనీయంగా ఉంటారు. వీరు కుటుంబం , స్నేహితుల పట్ల చాలా అంకితభావంతో ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ కుటుంబానికి, స్నేహితులకు అండగా నిలుస్తారు. ఇష్టమైన నీలం రంగు ఉన్నవారు చాలా తొందరగా భావోద్వేగాలకి లోనవుతారు. కానీ వాటిని బయటకు చూపించడానికి ఇష్టపడరు. స్వచ్ఛమైన మనసుతో ఉంటారు వీళ్లు.

పసుపు రంగు:

వీళ్లు చాలా సానుకూల మనస్తత్వం ఉన్నవాళ్లు. ప్రతి విషయంలో ఆశావహంగా ఉంటారు. పాజిటివ్ అంశాల మీద మాత్రమే దృష్టి పెడతారు. దేంట్లో అయినా మంచినే చూస్తారు. వీళ్ల వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తారు.

గులాబీ రంగు:

వీళ్లు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. జీవితంలో సమతుల్యతను పాటిస్తారు. తమ బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తారు. వీరికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. చాలా తొందరగా స్నేహితుల్ని చేసుకోగలుగుతారు. సునాయాసంగా మనుషులు వారికి దగ్గరవుతారు. గులాబీ రంగును ఇష్టపడే వ్యక్తులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. వారి జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకు సాగుతారు.

Whats_app_banner