Potato: ఆలూ తినాల్సిన సరైన పద్ధతులు ఇవే.. ఇలా తింటే అనారోగ్యం ఊసే లేదు-know what are the healthy ways to eat potato for weight loss and low gi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato: ఆలూ తినాల్సిన సరైన పద్ధతులు ఇవే.. ఇలా తింటే అనారోగ్యం ఊసే లేదు

Potato: ఆలూ తినాల్సిన సరైన పద్ధతులు ఇవే.. ఇలా తింటే అనారోగ్యం ఊసే లేదు

Koutik Pranaya Sree HT Telugu
Jul 28, 2024 05:00 PM IST

Potato: బంగాళాదుంపలతో బరువు పెరగకుండా ఉండటానికి బంగాళాదుంపలను ఎలా వండుకోవాలో తెల్సుకోండి.అలాగే బంగాళదుంపలను ఎంత మోతాదులో తింటే బరువు పెరగకుండా చూసుకోవచ్చో చూడండి.

బంగాళదుంపలు
బంగాళదుంపలు (shutterstock)

బంగాళాదుంప టిక్కీ అయినా, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా.. ఆలూతో చేసే స్నాక్స్ పేరు వింటేనే నోరూరుతుంది. కానీ బరువు పెంచేస్తుందని, షుగర్ స్థాయుల్ని పెంచేస్తుందని బంగాళదుంపను ఒక అనారోగ్యకరమైన ఆహారంగా చూడటం మొదలుపెట్టారు. వీటిని సరైన విధానంలో తింటే బరువు పెరగడానికి బదులు తగ్గే అవకాశాలూ ఉంటాయి. దాన్ని వండుకునే పద్ధతి బట్టి బరువు తగ్గడం లేదా పెరగడం ఆధారపడి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

వీటి ప్రకారం బంగాళాదుంపల్లో ఉండే పిండి పదార్థాలు శరీరంలో చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగవు. బరువు పెరుగుతామనే భయం ఉండదు. కాబట్టి మీరు బంగాళాదుంప ప్రియులైతే బంగాళాదుంపలను ఈ విధంగా తినవచ్చు. ఊబకాయం వస్తుందనే భయమూ ఉండదు.

ఉడకబెట్టి తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది:

మీరు బంగాళాదుంపలు తినాలనుకుంటే, ముందుగా ఉడకబెట్టండి. తర్వాత బంగాళాదుంపలను చల్లార్చి ఫ్రీజ్ చేయాలి. దీనివల్ల బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. ఉడికించిన బంగాళాదుంపలను నీరు, వైట్ వెనిగర్ ద్రావణంలో ఉంచి కాసేపు వేడి చేయండి. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ను మరింత తగ్గిస్తుంది. వెనిగర్‌కు బదులుగా నిమ్మరసం కూడా వాడొచ్చు. కానీ వెనిగర్ మంచి ఫలితం ఇస్తుంది. ఇలా చేయడం వల్ల 30 నుంచి 40 శాతం గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి తగ్గుతుంది.

మరిన్ని మార్గాలు:

1. బంగాళ దుంపలను ముక్కలుగా కోసి వేడినీటిలో అరగంట పాటు ఉడికించి చల్లారనివ్వాలి. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించడమే కాకుండా సులభంగానూ జీర్ణమవుతుంది.

2. మీరు బంగాళాదుంపలను తినాలనుకుంటే, మైక్రోవేవ్లో బేక్ చేసి కూడా తినొచ్చు. కుక్కర్లో ఉడకబెట్టడం లేదా ఆవిరి మీద ఉడికించి లేదా స్టీమ్ చేసి కూడా తినవచ్చు.

3. ఆలూతో డీప్ ఫ్రై చేసిన వంటలు, మసాలాలు దట్టించడం మాత్రం చేయకూడదు.చక్కెర, ఉప్పు, నూనెను చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగించాలని గుర్తుంచుకోండి. చాలా కొద్దిగా నూనెను బంగాళదుంపలకు రాసి బేక్ చేసి ఆరిగానో, చిల్లి ఫ్లేక్స్ చల్లుకుని తింటే మంచి రుచి. ఇదే పద్ధతిలో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు.

3. బంగాళాదుంపలను తొక్కతో సహా ఆహారంలో ఉపయోగిస్తే, ఫైబర్ కూడా తగినంత పరిమాణంలో లభిస్తుంది.

4. ఉడికించిన బంగాళదుంపను ముద్దలా చేసి ప్లేట్‌లో ఉంచాలి. పక్కన షాలో ఫ్రై చేసిన బ్రొకలీ లేదా మరిన్ని షాలో ఫ్రై చేసిన కూరగాయలతో సర్వ్ చేయొచ్చు. ఆలూ కన్నా వీటి పరిమాణం రెండింతలుండాలి. చూడ్డానికి ఫ్యాన్సీగా ఉండే ఈ వంటకం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. అదే ఏదైనా మాంసం లేదా చేపలతో కలిపి బంగాళ దుంపలను తింటే, అది ఇన్సులిన్‌ను ప్రభావితం చేస్తుంది. జంతువుల నుంచి వచ్చే ప్రొటీన్లు అంత మంచివి కావు.

5. ఇలా తింటే మంచిదని చెప్పి ఎక్కువగా ఆలూ తినేయకూడదు. రోజూ ఒకటి కంటే ఎక్కువ బంగాళదుంప తినడం మంచిది కాదు. చెప్పాలంటే రెండు నుంచి అయిదు పౌండ్ల కంటే ఎక్కువగా వీటిని తినకూడదు.

Whats_app_banner