అయోడిన్ ఆరోగ్యానికి చాలా అవసరం. ఉప్పు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Unsplash
By Anand Sai May 18, 2024
Hindustan Times Telugu
అయితే ఉప్పును మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Unsplash
మీ ఆహారంలో ఎక్కువ ఉప్పు కలపడం వల్ల ప్రాణాపాయం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఇక్కడ ఉన్నాయి.
Unsplash
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. బీపీ కాకుండా ఉప్పు తీసుకోవడం రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది.
Unsplash
ఉప్పు ఎక్కువ తింటే రక్తనాళాలపై ప్రభావంతో గుండెకు ఆక్సిజన్ సరిగా అందనప్పుడు గుండెపోటు వస్తుంది.
Unsplash
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. ఇది అజీర్ణం, ఎసిడిటీ సమస్యలను కలిగిస్తుంది.
Unsplash
మధుమేహం ఉన్నవారు ఉప్పు తీసుకోవడం చాలా తగ్గించాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉప్పు తీసుకోవడంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Unsplash
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవల్స్, గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది.
Unsplash
విటమిన్ డీ లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు- అందుకే ఈ ఫుడ్స్ తినండి!