Coriander health benefits: కొత్తిమీరతో 12 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
coriander health benefits: కొత్తిమీర బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడడం కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
కొత్తిమీరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
coriander health benefits: కొత్తిమీర ఔషధ మొక్క అనే చెప్పాలి. వింటర్ సీజన్‌లో ధర కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కొత్తిమీరలో ఉండే విటమిన్లు, ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
కొత్తిమీరలో ఉండే విటమిన్ల, ఖనిజలవణాలు
కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి.
కొత్తిమీరతో ఉపయోగాలు
- గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం వాటి నుంచి ఉపశమనం ఇస్తుంది.
- నోట్లో అల్సర్లు, పగుళ్లు, దుర్వాసనతో బాధపడుతుంటే కొత్తిమీర ఆకులు నమలడం వల్ల అవి నయమవుతాయి.
- కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు నివారణగా కొత్తిమీర ఆకుల రసం తేనెతో కలుపుకొని తాగాలి.
- కొత్తిమీర వాతాన్ని తగ్గిస్తుంది. బీపీ, డయాబెటిస్ వ్యాధులు ఉన్న వారికి ఉపయోగపడుతుంది. కొత్తమీర పచ్చడి చేసుకుని అన్నంలో తింటే కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మల విసర్జన సాఫీగా ఉంటుంది.
- కొత్తిమీరలో విటమిన్ కే ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.
- విటమిన్ కే నిల్వలు మీ ఎముకల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ నుంచి కాపాడుతాయి.
- మీ శరీరంలోని ఫ్రీరాడికల్స్.. కణాలను దెబ్బతీయకుండా కొత్తిమీరలో ఉండే ఆంటాక్సిడెంట్లు కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్ మీ కణాలను దెబ్బతీసి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటికి కారణమవుతాయి. కొత్తిమీర ఇలాంటి ప్రమాదాలను నివారిస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుతుంది.
- కొత్తిమీర డైయూరెటిక్‌గా పనిచేసి మీశరీరంలోని అదనపు సోడియంను బయటికి పంపించేస్తుంది. తద్వారా మీ బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. శరీరంలోని ఇతర మలినాలను కూడా బయటకు పంపిస్తుంది.
- మీ శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఎథెరోస్ల్కెరోసిస్ అనే గుండె జబ్బు రిస్క్‌ను తగ్గిస్తుంది.
- శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (మంటలు, నొప్పులు) ఉన్న వారు కొత్తిమీర మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది దీర్ఘకాలిక వ్యాధులను కూడా తగ్గించే సామర్థ్యం కలిగి ఉంది. క్యాన్సర్ సెల్స్ వృద్ధిని కూడా కొత్తిమీర నివారిస్తుంది.
- కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్ పేషెంట్లకు ఇది చాలా ఉపయోపడుతుంది.
కొత్తిమీరను ఇలా ఉపయోగించవచ్చు..
కొత్తిమీరను వినియోగించడం చాలా సులువు. నేరుగా ఆకులు తినొచ్చు. ప్రతి కూరపై నుంచి జల్లుకోవచ్చు. కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు. మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. రసంగా తాగొచ్చు. కొత్తిమీర గింజలు (ధనియాలు) కూడా కొత్తిమీర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి.