Melon Smoothie | రంగు రుచి చిక్కదనాల మస్క్ మిలన్ స్మూతీ, తీరుస్తుంది మీ దాహార్తి
చెఫ్ కునాల్ కపూర్ రుచికరమైన మస్క్ మెలన్ స్మూతీ రెసిపీని పంచుకున్నారు. ఈ స్మూతీ ఎంతో రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. ఎలా చేయాలో మీరు ప్రయత్నించండి.
వేసవి ఉన్నన్నీ రోజులూ మనకు ఉక్కపోత, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు తప్పవు. అయినప్పటికీ ఈ సమస్యను అధిగమించటానికి మన ముందు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వేడికి శరీరం చెమటలు పట్టి చాలా నీటిని కోల్పోతుంది. అందుకు మనం అనేక రకాల ఆరోగ్యకరమైన పానీయాలు, పండ్ల రసాలు, స్మూతీలతో కోల్పోయిన నీటిని భర్తీ చేయవచ్చు.
ఈ వేసవిలో స్మూతీలు తీసుకోవడం చాలా మందికి ఇష్టముంటుంది. ఈ స్మూతీలను మనకు నచ్చిన పండ్లతో చేసుకోవచ్చు లేదా కూరగాయలతోనూ చేసుకోవచ్చు. సహజమైన తాజా పదార్థాలతో చేస్తాము కాబట్టి ఇవి శరీరానికి ఎంతో ఆరోగ్యకరం. ఇందులో కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. స్మూతీలు ఆకలిని తీర్చే అల్పాహారంగా కూడా ఉంటాయి.
ఈ వారం చెఫ్ కునాల్ కపూర్ మస్క్ మెలన్ స్మూతీ రెసిపీని పంచుకున్నారు. ఈ స్మూతీ ఎంతో రుచికరమైనది, ఆరోగ్యకరమైనదే కాకుండా దీనిని తయారు చేయడం చాలా సులభం.
కావాల్సిన పదార్థాలు
- మస్క్ మెలన్ పండు ముక్కలు - 1 కప్పు
- పాలు - 1 కప్పు
- తేనె - 1½ టేబుల్ స్పూన్
- సెలెరీ- 1 టేబుల్ స్పూన్
- అల్లం - ¼ tsp
- జాజికాయ పొడి - చిటికెడు
- నల్ల మిరియాల పొడి - చిటికెడు
- వెనీల ఎసెన్స్ - కొన్ని చుక్కలు
- కొబ్బరి నీరు - ¾ కప్పు
తయారీ విధానం
పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ మిక్సర్ బ్లెండర్లో వేయండి. అన్నింటినీ కలిపి చక్కటి స్మూతీగా మిక్స్ చేయండి. అంతే!
ఈ స్మూతీని కస్తూరి పుచ్చకాయ ముక్కతో సర్వ్ చేయండి.
సంబంధిత కథనం