Kiss Day 2023 | ముక్కుపై ముద్దు పెడితే ఒక అర్థం, చెంపపై ముద్దు పెడితే మరొక అర్థం.. ముద్దు ముచ్చట తెలుసుకోండి!
Kiss Day 2023: ప్రేమను వ్యక్తం చేసే మార్గాలలో ముద్దు పెట్టడం కూడా ఒకటి. అయితే ముద్దులో చాలా రకాలు ఉన్నాయి, వాటికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ఆ ముద్దు ముచ్చట్లను ఇక్కడ తెలుసుకోండి.
Kiss Day 2023: ప్రేమికుల కోసం సంవత్సరంలోని ఒక ప్రత్యేక వారం, ఒక ప్రత్యేకమైన రోజు అని ఒకటి ఉంది. ప్రత్యేకమైన రోజు అంటే ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే (Valentine's Day) . దీనిని ప్రేమికుల రోజు అని కూడా అంటారు. ప్రేమికుల రోజుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ రోజు కోసం గత వారం రోజులుగా రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే అంటూ జరుపుకున్నారు. ఈ వాలెంటైన్స్ వీక్ (Valentine's Week) లో ఫిబ్రవరి 13న జరుపుకునే వేడుక కిస్ డే.
వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న ప్రేమ జంటలు తమ ప్రియాతి ప్రియమైన వ్యక్తికి ముద్దు పెట్టి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. సింగిల్స్ కూడా తమ కుటుంబ సభ్యులకు, తమ స్నేహితులకు ముద్దు పెట్టి తమ ప్రేమను తెలియజేయవచ్చు.
Types of Kisses and Meanings- ముద్దు రకాలు, వాటి అర్థాలు
ఒక చిన్న ముద్దుకు కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి. అది మీరు పెట్టే విధానాన్ని బట్టి ఎదుటి వారికి మీరు ఏం కోరుకుంటున్నారో తెలియజేయగలదు. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి, వేటికవే వేర్వేరు అర్థాలు ఉన్నాయి. మరి ఎన్ని రకాల ముద్దులు ఉన్నాయి, వాటి అర్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
చెంపపై ముద్దు- Kiss on Cheeks
చెంపపై ముద్దు పెడితే అది వారి పట్ల మీ ఆప్యాయత, ఆత్మీయతను తెలియజేస్తుంది. సాధారణంగా మనకు చాలా ఆత్మీయులైన వ్యక్తులకు చెంపపై ముద్దు పెట్టి ప్రేమను చూపుతాం.
నుదిటిపై ముద్దు - Kiss on Forehead
నుదుటిపై ముద్దు ప్రశంసను తెలియజేస్తుంది, భద్రతను తెలియజేస్తుంది. మీరు ఒకరిని మెచ్చుకోవడం, వారి కోసం మీరు ఉన్నారని చెప్పటం కోసం నుదుటిపై ముద్దుపెట్టి మీ భావాన్ని వ్యక్తీకరించవచ్చు.
చేతిపై ముద్దు - Kiss on Hands
ఇది ఒకరితో సంబంధాన్ని ప్రారంభించటానికి లేదా సత్సంబంధాలు కొనసాగించటానికి మీరు ఆసక్తిని కనబరుస్తున్నట్లు సంకేతం. ఇంకా ఒకరిపై గౌరవాన్ని, అభిమానాన్ని చాటడం కోసం కూడా చేతిపై ముద్దు పెడతారు.
ముక్కుపై ముద్దు - Kiss on Nose
ముద్దులలోని అందమైన రూపాల్లో ఒకటి, ఇది ఎవరైనా వ్యక్తులు తాము పిచ్చిగా ప్రేమించే వ్యక్తులకు ముక్కుపై ముద్దు పెట్టి తమ మనసులోని ప్రేమను పంచుతారు. ఒకరకంగా ఇది ముద్దు చేయడం లాంటిది.
ఫ్రెంచ్ ముద్దు- French Kiss
ఇది ఒక తీవ్రమైన, ఉద్వేగభరితమైన ముద్దు రూపం. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకునే వ్యక్తులు, లేదా ఒకరి రూపానికి ఆకర్షితమైన వ్యక్తులు తమ పెదాలను వారి పెదాలతో బంధించి చుంబనం చేసే పద్ధతి. ప్రేమికులు, కామికులు, శృంగార భాగస్వాములు పెట్టుకునే ముద్దు ఇది.
మెడపై ముద్దు- Kiss on Neck
ఈ రకమైన ముద్దు సాధారణంగా లైంగిక ఉద్దేశాలను తెలియజేస్తుంది. ఒకరినిఒకరు గాఢంగా ప్రేమించుకునేటపుడు తమలోని శృంగార కోరికలను వ్యక్తపరిచే విధంగా పెట్టుకునే ముద్దు ఇది.
చెవి పక్కన ముద్దు- Earlobe Kiss
ఇది ఎదుటి వ్యక్తిని ఉత్తేజపరిచేందుకు, అభినందించేందుకు పలకరింపుగా ఉపయోగించే ముద్దు. ఇది ముద్దు యొక్క ఇంద్రియ రూపం.
సంబంధిత కథనం