Kisan Credit Card : రైతులకు సాయం చేసే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి?-kisan credit card benefits know how to apply kisan credit card apply in online crop loan ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kisan Credit Card : రైతులకు సాయం చేసే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి?

Kisan Credit Card : రైతులకు సాయం చేసే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి?

Anand Sai HT Telugu
Jun 18, 2024 09:30 AM IST

Kisan Credit Card Scheme : రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందజేస్తుంది. అందులో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్. దీనిని ఎలా అప్లై చేయాలి? వచ్చే లాభాలేంటి చూద్దాం..

కిసాన్ క్రెడిట్ కార్డ్ లాభాలు
కిసాన్ క్రెడిట్ కార్డ్ లాభాలు (Unsplash)

రైతులు వ్యవసాయం చేసే సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం సహాయంతో, రైతులు తక్కువ వడ్డీకి స్వల్పకాలిక రుణాన్ని పొందవచ్చు. రైతులకు సాధికారత కల్పించేందుకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి సౌకర్యాలను అందిస్తుంది. రైతులకు వ్యవసాయ పనులు చేసేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకాన్ని ప్రారంభించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకోండి..

కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద రైతులకు తక్కువ వడ్డీకి రూ.3 లక్షల వరకు రుణాలు అందజేస్తారు. ఈ పథకం ద్వారా రైతులు చాలా సులభంగా రుణాలు పొందుతారు. దీని కారణంగా రైతులు వడ్డీల బారి నుండి రక్షించబడతారు. ఇది కాకుండా ఈ పథకం కింద KCC హోల్డర్ రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కూడా అందిస్తారు. ఇందులో రైతుకు మరణం లేదా శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ. 50,000 వరకు, ఇతర నష్టాలకు రూ. 25,000 వరకు బీమా కవరేజ్ ఉంటుంది.

ఈ క్రెడిట్ కార్డుతో పాటు రైతులకు సేవింగ్స్ ఖాతా, స్మార్ట్, డెబిట్ కార్డులను అందజేస్తారు. ఇది కాకుండా రైతులు పొదుపుపై ​​వడ్డీని పొందుతారు. రుణాన్ని తిరిగి చెల్లించే వెసులుబాటును కూడా ఇస్తారు. ఈ రుణం చెల్లించేందుకు రైతులకు మూడేళ్ల గడువు ఉంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాన్ని పొందడానికి, భూమి యజమానులు, వాటాదారులు, కౌలు రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం రైతు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు ఉండాలి.

ఎలా అప్లై చేయాలి?

ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి, రైతులు బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇప్పుడు మీరు కిసాన్ హోమ్‌పేజీకి వెళ్లి క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకోవాలి.

ఇప్పుడు మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తు ఎంపికపై క్లిక్ చేయవచ్చు.

మీ ముందు ఒక దరఖాస్తు ఫారమ్ కనిపిస్తుంది. మీరు మీ మొత్తం సమాచారాన్ని అందులో నింపాలి.

సరైన సమాచారాన్ని పూరించిన తర్వాత, మీరు సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

దీని తర్వాత మీ వివరాలు కొన్ని రోజుల్లో ధృవీకరిస్తారు.

సాధారణంగా ఐదు సంవత్సరాలు ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది.

ఏటా రెన్యూవల్ చేసుకోవాలి.

పంటలు పండించి విక్రయించిన తర్వాత రుణాలు చెల్లించాలి.

రుణ పరిమితి రుణదాత నియమాలు, రైతు క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.

కార్డ్ హోల్డర్లు నిర్దిష్ట పంట రుణ రకాలకు జాతీయ పంటల బీమా పథకం కింద బీమా కవరేజీని పొందవచ్చు. కార్డ్ హోల్డర్లు ప్రకృతి వైపరీత్యాలు లేదా తెగుళ్ల దాడుల తర్వాత పాడైన పంట సీజన్‌కు కూడా కవరేజీని పొందవచ్చు. 70 ఏళ్లలోపు కార్డు హోల్డర్లకు వ్యక్తిగత ప్రమాద కవర్ అందజేస్తుంది. తీసుకున్న రుణాలు ఏడాదిలోపు చెల్లించే రైతులకు వడ్డీ రేటులో మూడు శాతం రాయితీ ఉంటుంది.

బ్యాంకులో కూడా చేసుకోవచ్చు

మీకు ఆన్‌లైన్ అప్లై చేయడం ఇబ్బందిగా ఉంటే.. కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను అనేక బ్యాంకులలో అప్లై చేసుకోవచ్చు. మంజూరు చేయడానికి ముందు, బ్యాంక్ దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తారు. దరఖాస్తుదారు భూమి, పంట పండించే విధానం, ఆదాయం మొదలైనవాటిని కూడా చూస్తారు.

Whats_app_banner