Shower After Eating | తిన్న వెంటనే స్నానం చేయకూడదు.. ఎందుకో తెలుసా?-khana khane ke turant baad nahana kyun nhi chahiye disadvantages of bathing right after meal ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shower After Eating | తిన్న వెంటనే స్నానం చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Shower After Eating | తిన్న వెంటనే స్నానం చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Rekulapally Saichand HT Telugu
Sep 12, 2022 12:31 PM IST

Shower Right After Meal Side Effects: ఆయుర్వేదం ప్రకారం, ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. దీని వల్ల మీరు జీర్ణక్రియకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలను తలెత్తుతాయి.

<p>shower</p>
shower

భోజనం చేసిన తర్వాత స్నానం చేసే అలవాటు చాలా మందికి ఉంది. అయితే ఆయుర్వేదం ప్రకారం ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. దీని వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉదరంలో వ్యర్థాలు పెరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ అలెర్జీలు వంటి సమస్యలు కూడా వస్తాయి.

తిన్న వెంటనే స్నానం ఎందుకు చేయకూడదు

సాధరణంగా నీరు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆహారం తిన్న వెంటనే స్నానం చేస్తే, రక్తప్రసరణ మందగిస్తుంది, ఇది జీర్ణక్రియను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు చాలా శక్తి అవసరం. ఉదర భాగంలో రక్త ప్రసరణ బాగా అవసరం. కాబట్టి, ఆయుర్వేదం ప్రకారం, భోజనం తర్వాత స్నానం చేయడం అనారోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ప్రముఖ డాక్టర్ రేఖ ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ప్రకారం తినడానికి 1-3 గంటల ముందు స్నానం చేయడానికి సరైన సమయం కాదని తెలిపింది.

వైద్య శాస్త్రం ఏం చెబుతుందో

ఆయుర్వేదం తెలిపినట్లుగా భోజనం తర్వాత స్నానం చేయడం మంచిది కాదని వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. ఇది అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రతను అసమతుల్యతగా మారుస్తుంది. దీని ద్వారా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అయితే, వేడి నీటితో స్నానం చేయడాన్ని హైపర్‌థెర్మిక్ చర్య అంటారు. సాధారణంగా వేడి నీటితో సాన్నం చేయడం శరీరానికి చాలా మంచిది. వేడితో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే స్నానం ఆహారం తీసుకున్న తర్వాత చేయడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం