Karivepaku Pachadi: కరివేపాకు పచ్చడి ఇలా స్పైసీగా చేసుకుంటే ఎంత అన్నమైనా ఇట్టే తినేస్తారు, రెసిపీ ఇదిగోండి-karivepaku pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Karivepaku Pachadi: కరివేపాకు పచ్చడి ఇలా స్పైసీగా చేసుకుంటే ఎంత అన్నమైనా ఇట్టే తినేస్తారు, రెసిపీ ఇదిగోండి

Karivepaku Pachadi: కరివేపాకు పచ్చడి ఇలా స్పైసీగా చేసుకుంటే ఎంత అన్నమైనా ఇట్టే తినేస్తారు, రెసిపీ ఇదిగోండి

Haritha Chappa HT Telugu
Aug 21, 2024 05:30 PM IST

Karivepaku Pachadi: కరివేపాకులు చాలా తక్కువ ధరకే వస్తాయి. వాటితో పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చేసుకుంటే ఎంత అన్నమైనా చిటికెలో తినేస్తారు. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

కరివేాపాకు పచ్చడి
కరివేాపాకు పచ్చడి

Karivepaku Pachadi: ప్రతి కూరలో కరివేపాకులు పడాల్సిందే, కానీ వాటిని తీసి బయటపడేసే వారే ఎక్కువ. తినేవారి సంఖ్య తక్కువే. నిజానికి కరివేపాకులు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక్కడ మేము కరివేపాకు పచ్చడి రెసిపీ ఇచ్చాము. కరివేపాకు పచ్చడి అనగానే ముఖం ముడుచుకు పోతుంది... కానీ దీన్ని సరైన పద్ధతిలో చేసి తింటే ఆ రుచే వేరు. వేడి వేడి అన్నంలో ఈ కరివేపాకు పచ్చడి కలుపుకొని తింటే ఎంత అన్నమైనా తినేస్తారు. పెద్ద వాళ్లకు దీన్ని కొంచెం స్పైసీగా చేసుకొని తింటే టేస్టీగా అనిపిస్తుంది.అలాగే దోసెలు, ఇడ్లీలోకి కూడా ఈ కరివేపాకు పచ్చడి మంచి జోడి అని చెప్పుకోవాలి. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

కరివేపాకులు - పావు కిలో

చింతపండు - నిమ్మకాయ సైజులో

నూనె - సరిపడినంత

ఇంగువ - చిటికెడు

ఆవాలు - ఒక స్పూను

ఎండుమిర్చి - ఎనిమిది

మెంతి గింజలు - పావు స్పూను

శనగపప్పు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

కరివేపాకు పచ్చడి రెసిపీ

1. కరివేపాకులను ముందుగానే శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో మినప్పప్పు, శనగపప్పును వేసి వేయించుకోవాలి.

4. ఆ తర్వాత మెంతులను, ఎండుమిర్చిని కూడా వేసి వేయించాలి.

5. వీటన్నిటి తర్వాత ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకులను వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి.

6. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

7. మిక్సీ జార్లో వేయించిన కరివేపాకుల మిశ్రమం, చింతపండు, ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి.

8. కొద్దికొద్దిగా నీరు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.

9. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

10. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి.

11. చిన్న కళాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ వేసి వేయించి ఈ తాలింపును పచ్చడిపై వేసుకోవాలి. అంతే టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ అయినట్టే.

12. దీన్ని మీరు ఒకసారి చేసుకుంటే వారం రోజులు పాటు నిల్వ ఉంటుంది కాకపోతే ఫ్రిజ్లో పెట్టుకోవాలి.

కరివేపాకు పచ్చడిని మరింత టేస్ట్ కావాలనుకుంటే కొన్ని కొత్తిమీర ఆకులను కూడా కలుపుకోవచ్చు. మీకు స్పైసీగా తినాలనిపిస్తే ఎండుమిర్చి సంఖ్య పెంచండి లేదా పచ్చిమిర్చిని జోడించుకోవచ్చు. పచ్చిమిర్చిని వేయించి జోడిస్తేనే మంచి రుచిగా అనిపిస్తుంది. పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం కారం తక్కువగా పెడితే మంచిది. ఈ కరివేపాకు పచ్చడి తినడం వల్ల జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మం కూడా మెరుపును సంతరించుకుంటుంది.

Whats_app_banner