Jagannath Rath Yathra 2022 : జగన్నాథుని రథయాత్ర షెడ్యూల్, ప్రాముఖ్యతలివే..-jagannath rath yathra 2022 significance and schedule and more interesting facts about rath yathra ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jagannath Rath Yathra 2022 : జగన్నాథుని రథయాత్ర షెడ్యూల్, ప్రాముఖ్యతలివే..

Jagannath Rath Yathra 2022 : జగన్నాథుని రథయాత్ర షెడ్యూల్, ప్రాముఖ్యతలివే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 01, 2022 06:34 AM IST

పూరీ జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం. ఈ ఉత్సవాన్ని ఆషాడమాసంలోనే నిర్వహిస్తారు. దీనిని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. దేశంలో జరిగే గొప్ప ఉత్సవాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు. మరి ఇంతటి గొప్ప ఉత్సవమైన రథయాత్ర గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా?

<p>జగన్నాథ రథయాత్ర 2022</p>
జగన్నాథ రథయాత్ర 2022

Jagannath Rath Yathra 2022 : జగన్నాథ రథయాత్ర భారతదేశంలోని అత్యంత ప్రముఖ హిందూ పండుగలలో ఒకటి. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం అంటే.. శుక్ల పక్ష ద్వితీయ తిథి, ఆషాఢ మాసం ప్రకారం నిర్వహిస్తారు. దీని ప్రకారం జగన్నాథ్ పూరీ రథయాత్ర 2022 ఒడిశాలో.. జూలై 1, 2022 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 12, 2022న ముగుస్తుంది. దీనిలో భాగంగా ఆలయంలో ఉన్న బలభద్ర, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను తెచ్చి.. రథమునందు ప్రతిష్టించి రథయాత్రను జరుపుతారు. ఈ సంవత్సరం ఈ రథయాత్ర భక్తులకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కరోనా వల్ల ఈ రథయాత్రకు రెండేళ్ల విరామం వచ్చింది.

ప్రాముఖ్యత

ఈ రోజున జగన్నాథుడు, తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి.. 12వ శతాబ్దపు నాటి ఆలయం నుంచి బయటకు వచ్చి.. జగన్నాథ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి రథాలను అధిరోహిస్తారు.

వారు అక్కడ ఎనిమిది రోజులు ఉండగా... రథయాత్ర తర్వాత నాల్గవ రోజున జగన్నాథుని భార్య అయిన లక్ష్మీ దేవి అతనిని వెతుకుతూ గుండిచా ఆలయానికి వచ్చిందని భక్తులు నమ్ముతారు.

బహుద యాత్ర అని పిలిచే తొమ్మిదవ రోజు దేవతలు తమ ఇంటికి తిరిగి వస్తారు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష దశమి తిథి నాడు జరుపుకుంటారు.

జగన్నాథ రథయాత్ర షెడ్యూల్

జూలై 1: జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. దేవతలు గుండిచా ఆలయం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

జూలై 5: హేరా పంచమి. ఇది గుండిచా ఆలయంలో దేవతలు నివసించే మొదటి ఐదు రోజులు.

జూలై 8: సంధ్యా దర్శనం/ నవమి దర్శనం/ అడప్ మండప దర్శనం, ఇది ఒక శుభ సందర్భం. ఈ సమయంలో భక్తులు అన్ని దేవతలను దర్శించుకుంటారు. ప్రార్థిస్తారు.

జూలై 9: బహుదా యాత్ర. దేవతలు తమ ఇంటికి తిరిగి వచ్చే కాలాన్ని బహుదా యాత్ర అని పిలుస్తారు.

జూలై 10: సునాబేస. జగన్నాథ ఆలయంలో ముగ్గురు దేవతలు తిరిగిన కాలాన్ని సునాబేస అంటారు.

జూలై 11: ఆధార్ పనా. పవిత్ర రథాలకు ప్రత్యేక పానీయం అందించే ఆచారాన్ని ఆధార్ పనా అంటారు.

జూలై 12: జగన్నాథ యాత్ర ముగిసే సమయానికి నిర్వహించే ప్రత్యేక ఆచారం నీలాద్రి.

Whats_app_banner

సంబంధిత కథనం