Isha Ambani: ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఇషా అంబానీ, ఇలాంటి ఫ్యాషన్ ముందెప్పుడూ చూసుండరు-isha ambani who set a new trend in fashion has never seen such fashion before ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Isha Ambani: ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఇషా అంబానీ, ఇలాంటి ఫ్యాషన్ ముందెప్పుడూ చూసుండరు

Isha Ambani: ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఇషా అంబానీ, ఇలాంటి ఫ్యాషన్ ముందెప్పుడూ చూసుండరు

Haritha Chappa HT Telugu
Jul 19, 2024 04:30 PM IST

Isha Ambani: అనంత్ అంబానీ -రాధిక మర్చెంట్ వివాహం వైభవంగా జరిగి పోయింది. ఈ వేడుకలో ఇషా అంబానీ చాలా గ్లామరస్ గా కనిపించింది. ఆమె ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్ ను సెట్ చేసేందుకు సిద్ధంగా కనిపిస్తోంది.

ఇషా అంబానీ
ఇషా అంబానీ

అనంత్ అంబానీ పెళ్లిల్లో ఇషా చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్,  జ్యూయలరీ ఎంతో మందిని ఆకర్షించాయి. ఇషా అంబానీ కొత్త కొత్త ఫ్యాషన్ ప్రయోగాలు చేసేందుకు వెనుకాడడం లేదు. ఇటీవల అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల శుభోత్సవ కార్యక్రమంలో ఇషా అంబానీ తన ఫ్యాషన్ సెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అనంత్-రాధికల శుభోత్సవ వేడుకలో ఇషా లుక్ చాలా రాయల్ గా కనిపించింది. ఈ పెళ్లిలో ఇషా చాలా ప్రత్యేకమైన, విభిన్నమైన ఆభరణాలను ధరించి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడిని నెలకొల్పింది. ఈ వేడుకలో సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన వైట్ కలర్ హెవీ సిల్క్ లెహంగాను ఇషా ధరించింది. ఈ లెహంగాలో ఇషా చాలా అందంగా కనిపించింది. ఈ లెహంగా ప్రత్యేకత ఏమిటంటే ఇది నిజమైన సిల్వర్ జర్దోజీ ఎంబ్రాయిడరీతో తయారు చేయబడింది. అంటే వెండి తీగలతో ఆ లెహెంగాపై ఎంబ్రాయిడరీ చేశారు. లెహంగాతో తన లుక్ ను పూర్తి చేయడానికి ఇషా రత్నాలతో కూడిన విలువైన మల్టీ కలర్ నెక్లెస్ ను కూడా ధరించింది. కానీ చెవి దిద్దులు మాత్రం ఆమె ఎంతో భిన్నంగా ధరించింది. ఫ్యాషన్ ట్రెండ్ ను సెట్ చేసింది.

yearly horoscope entry point

 

ఇషా అంబానీ
ఇషా అంబానీ

రూబీ, పోల్కీ డైమండ్స్, లెహంగాతో కూడిన ఎమరాల్డ్ పొదిగిన  విలువైన నెక్లెస్ ను ధరించింది ఇషా. నెక్లెస్ కంటే, ఆమె పెట్టుకున్న చెవి దిద్దులే ఫ్యాషన్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించాయి. ఇషా రెండు చెవులకు వేర్వేరు రంగుల చెవిపోగులు ధరించింది. ఆమె ఒక చెవిలో ఆకుపచ్చ ఎమరాల్డ్ ధరించగా, మరో చెవిలో ఇషా తెలుపు డైమండ్ చెవిపోగును ధరించింది. ఇషా అంబానీకి చెందిన ఈ నగలను వీరేన్ భగత్ డిజైన్ చేశారు.

 

ఇషా అంబానీ
ఇషా అంబానీ

ఇషా అంబానీ మేకప్ కూడా చాలా సింపుల్ గా ఉంది. న్యూడ్ మేకప్,  సిల్క్ పోనీ హెయిర్ స్టైల్ లో ఇషా లుక్ చాలా క్లాసీగా ఉంది. అయితే, ఇషా రంగురంగుల చెవిపోగులు మాత్రం వచ్చిన అతిథులను విపరీతంగా ఆకర్షించాయి.

Whats_app_banner