Isha Ambani: ఖరీదైన వజ్రాలతో తన పిల్లల పేర్లను హ్యాండ్ బాగ్ పై డిజైన్ చేయించుకున్న ఇషా అంబానీ, ఐడియా అదిరింది-isha ambani who had her childrens names designed on a handbag came up with the idea ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Isha Ambani: ఖరీదైన వజ్రాలతో తన పిల్లల పేర్లను హ్యాండ్ బాగ్ పై డిజైన్ చేయించుకున్న ఇషా అంబానీ, ఐడియా అదిరింది

Isha Ambani: ఖరీదైన వజ్రాలతో తన పిల్లల పేర్లను హ్యాండ్ బాగ్ పై డిజైన్ చేయించుకున్న ఇషా అంబానీ, ఐడియా అదిరింది

Haritha Chappa HT Telugu
Oct 11, 2024 08:30 AM IST

Isha Ambani: బిలియనీర్లు ఏం చేసినా గొప్పగానే ఉంటుంది. ఇషా అంబానీ తన కవల పిల్లల పేర్లను తన హ్యాండ్ బ్యాగ్ పై డిజైన్ చేయించింది. వజ్రాలతో వాటిని శ్లోకా మెహెతా కజిన్ డిజైన్ చేసింది.

ఇషా అంబానీ
ఇషా అంబానీ

హెర్మెస్ కెల్లీ కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ చాలా ఖరీదైనది. ధనవంతుల కుటుంబంలోని మహిళలు దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇటీవల నీతా అంబానీ నియాన్ గ్రీన్ 'బ్రాట్' మినీ కెల్లీ బ్యాగ్ తో కనిపించింది. ఇప్పుడు ఇషా ఒక కార్యక్రమానికి మినీ కెల్లీ బ్యాగ్ ను ఎంపిక చేసుకుంది. దాన్ని తనకు నచ్చినట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. ఆమె తన ఇద్దరు కవలల పేర్లను డైమండ్లతో ఆ బ్యాగ్‌కు అదనపు ఆకర్షణను తెచ్చింది. దీన్ని శ్లోకా మెహతా బంధువు డిజైన్ చేశారు.

శ్లోకా మెహతా బంధువు, బాగ్ బిజోక్స్ వ్యవస్థాపకురాలు ఆష్నా మెహతా. ఆమె ఇషా అంబానీ కోసం ఈ బ్యాగ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. హ్యాండ్ బ్యాగ్ లను అందంగా అలంకరించడానికి, పర్సనలైడ్జ్ చేయడంలో ఆమె దిట్ట.  ఆమె బ్రాండెడ్ లగ్జరీ యాక్ససరీలను డిజైన్ చేస్తుంది. ఇషా కొన్న మినీ కెల్లీ బ్యాగ్ పై ఇషా కవలలు  ఆదియా, కృష్ణ పేర్లను వజ్రాలతో అలంకరించింది.

'ఆడియా' పేరులో అరుదైన పింక్ డైమండ్స్ ను వినియోగించారు. ఇక కృష్ణ పేరులో ఆకుపచ్చ వజ్రాలను వాడారు. ప్రతి ఆకర్షణను డ్రాప్ డైమండ్ టాసెల్స్ తో అలంకరించారు. ఇషా అంబానీకి కస్టమ్ బ్యాగ్  చేసినట్టు ఆష్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.  పింక్, ఆకుపచ్చ రంగు డైమండ్స్ చాలా ఖరీదైనవి. వాటి ధరను మాత్రం బయట పెట్టలేదు.

ఆష్నా కేవలం ఇషాకే కాదు, నిక్కీ మినాజ్, విన్నీ హార్లో, పారిస్ హిల్టన్ వంటి తారలకు కూడా పర్సనలైజ్డ్ యాక్సెసరీస్ తయారు చేసింది. అంతేకాకుండా రాధికా మర్చంట్, అనంత్ అంబానీల గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా ఆమె బ్యాగ్ ఆకర్షణగా  నిలిచింది. జువెలరీ ఇన్ఫ్లూయెన్సర్ జూలియా చాఫె తన హెర్మెస్ బ్యాగ్ పై ఇలాంటి యాక్సెసరీలు డిజైన్ చేయించుకుంది.

ఇషా అంబానీ ఖరీదైన దుస్తులు, ప్రత్యేకమైన బ్యాగులను వాడడంలో ప్రసిద్ధి చెందింది. 2023 మెట్ గాలాకు హాజరైన సమయంలో, ఇషా స్వయంగా కార్ల్ లాగర్ఫెల్డ్ రూపొందించిన చానెల్ డాల్ బ్యాగ్ను తీసుకెళ్లింది. గేట్ వే ఆఫ్ ఇండియాలో డియోర్ ఫాల్ 2023 ప్రదర్శనకు హాజరైనప్పుడు ఆమె తీసుకెళ్లిన డియోర్ మినీ ఎలిగేటర్ స్కిన్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఖరీదైనదే.

ఇషా అంబానీ గురించి

ఇషా అంబానీ ఆనంద్ పిరమాల్ ను వివాహం చేసుకుంది. 2018 డిసెంబర్లో వీరి వివాహం జరిగింది. నవంబర్ 19, 2022న వారు తమ కవలలకు జన్మనిచ్చారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Whats_app_banner