Tea and Cigarette: సిగరెట్ కాలుస్తూ టీ తాగుతూ ఉంటే మజాగా ఉందా? భవిష్యత్తులో మాత్రం ఆ పెద్ద ప్రమాదంలో పడే అవకాశం
Tea and Cigarette: కొంతమందికి టీ తాగుతూ సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. వారు ఆ క్షణాన్ని ఎంతో ఆనందిస్తారు. అయితే ఈ అలవాటు మీకు తెలియకుండానే మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అనేక వ్యాధులకు గురి చేస్తుంది.
ఆఫీసులో పనిలో అలసిపోయినప్పుడు రిఫ్రెష్ అవ్వడానికి చాలా మంది మధ్యలో టీ బ్రేక్ తీసుకుంటారు. దీని కోసం టీ తాగుతూ సిగరెట్ తాగుతూ ఉంటారు. టీ, సిగరెట్ వ్యసనం చాలా పెరిగిపోతోంది. మీరు కూడా టీ తాగడంతో సిగరెట్లు కాల్చడానికి ఇష్టపడితే అది మీకు భవిష్యత్తులో అనేక పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. ఈ టీ, సిగరెట్ల కలయిక గుండె జబ్బులతో పాటు అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది.
గుండె పోటు వచ్చే అవకాశం
సిగరెట్‌లో సుమారు 6 నుంచి 12 మి.గ్రా నికోటిన్ ఉంటుంది. సిగరెట్ తాగేవారికి సాధారణ వ్యక్తుల కంటే గుండెపోటు వచ్చే అవకాశం రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ. సిగరెట్లలో ఉండే నికోటిన్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో సంకోచానికి కారణమవుతుంది, దీని వల్ల గుండెకు పరిశుభ్రమైన రక్త సరఫరా జరగదు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని అమాంతం పెంచుతుంది.
టీ వల్ల
టీలో కనిపించే పాలీఫెనాల్స్ అని పిలిచే సహజ సమ్మేళనాలు సాధారణంగా గుండె ఆరోగ్యానికి మంచివిగా చెబుతారు. కానీ పాలను టీలో కలపడం వల్ల దాని మంచి గుణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వాస్తవానికి, పాలలో కనిపించే ప్రోటీన్ టీలోని పాలీఫెనాల్ మూలకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా టీ ఎక్కువగా తాగడం వల్ల హృదయ స్పందన రేటు మారుతుంది. రక్తపోటు కూడా పెరుగుతుంది. కాబట్టి పాల టీని తాగక పోవడమే మంచిది.
క్యాన్సర్ ప్రమాదం
టీతో పాటూ సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం పెరుగుతాయని ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. టీలో ఉండే టాక్సిన్స్ ను సిగరెట్ పొగలో కలిపితే అవి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి టీతో పాటు సిగరెట్లు తాగకూడదు. ఈ అలవాటును ఎంతగా తగ్గించుకుంటే అంతమంచిది. టీతో పాటూ సిగరెట్ తాగే అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోండి.
-గుండె, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
- చేతులు, కాళ్లలో గ్యాంగ్రీన్
- జ్ఞాపకశక్తి కోల్పోవడం
- ఊపిరితిత్తుల్లో కుంచించుకుపోవడం
- కడుపులో పుండ్లు
- సంతానలేమి సమస్య
టీ, సిగరెట్ వ్యసనం మానేయడానికి పరిష్కారాలు
టీ, సిగరెట్ కాంబినేషన్ మానాలంటే మీకు ఎంతో సంకల్ప శక్తి ఉండాలి. ఈ వ్యసనం నుంచి బయటపడాలని మీరు గట్టిగా నిర్ణయించుకోవాలి. దీని నుంచి సులభంగా బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకోండి
పదేపదే టీ తాగడం వల్ల మీరు తరచుగా మూత్ర విసర్జన చేస్తారు, ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఈ వ్యసనాన్ని ఒంటరిగా విడిచిపెట్టలేకపోతే, మీ కుటుంబం లేదా సన్నిహిత స్నేహితుడి సహాయం తీసుకోండి. టీ తాగే సమయంలో మీకు ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడాలి. వీలైతే మానసిక వైద్యుల సహాయం కూడా తీసుకోండి.
తరచుగా ప్రజలు ఒత్తిడికి గురైనప్పుడు మాత్రమే ఎక్కువ టీ లేదా సిగరెట్లు తాగడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో, టీ, సిగరెట్లకు ముందు మీ ఒత్తిడికి కారణాన్ని తెలుసుకోవడం ద్వారా దానిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే టీ, సిగరెట్లకు అలవాటు పడిన వారు కాస్త ఒత్తిడి, అశాంతి ఉన్నప్పుడు సిగరెట్లు, టీ తాగడం మొదలుపెడతారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటే టీ, సిగరెట్ కాంబినేషన్ తాగాలన్నా కోరిక కూడా తగ్గుతుంది.