World no tobacco day: సిగరెట్లు తాగే మీ స్నేహితులకు, బంధువులకు ఈ కోట్స్, స్లొగన్స్ పంపండి, వారిలో మార్పును తీసుకురండి
World no tobacco day: సిగరెట్ తాగుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. పొగాకును తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.
World no tobacco day: ప్రతి ఏడాది మే 31న ప్రపంచవ్యాప్తంగా ‘ వరల్డ్ నో టొబాకో డే’ నిర్వహిస్తారు. ప్రపంచాన్ని పొగాకు రహితంగా మార్చడమే ఈ ప్రత్యేక దినోత్సవం లక్ష్యం. ఎంతోమంది పొగాకు బారినపడి అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ధూమపానం చేసిన వారికే కాదు, ఆ పొగను పీల్చిన పక్క వారికి కూడా ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. కేవలం ధూమపానం వల్ల ఏటా మిలియన్ల మంది మరణిస్తున్నారు.
ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతీ ఏడాది మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈరోజున పొగాకును వినియోగిస్తున్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కొన్ని రకాల కోట్స్, స్లోగన్లు పంచుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా వారిలో అవగాహనను, మార్పును తీసుకురావాల్సి ఉంది. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వారికి ఈ కోట్,స్ స్లొగన్స్ పంపండి. వారిలో ఎంతో కొంత మార్పుకు మీరు కారణం అవుతారు.
వరల్డ్ నో టొబాకో డే స్లోగన్లు
1. స్మోకింగ్... ఒక స్లో పాయిజన్. ఇది మీకే తెలియకుండా మిమ్మల్ని చంపుతుంది. క్రమంగా మీ ప్రియమైన వారిని చంపుతుంది. మన జీవితాలను నాశనం చేసే పొగాగుకు నో చెప్పండి.
2. ఎంతోమంది ప్రాణాలను తీస్తున్న పొగాకు నుండి రక్షణ పొందాలంటే ఒకటే మార్గం... పొగాకుకు నో చెప్పడం.
3. స్మోకింగ్ చేయడం వల్ల కొన్ని సెకన్ల పాటు మీకు థ్రిల్ రావచ్చు. కానీ అది మీ ఆయుష్షును తగ్గిస్తుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి స్మోకింగ్ ను వదిలేయండి.
4. ఇతర వ్యసనాలతో పోలిస్తే పొగాకు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. సిగరెట్ నుంచి వచ్చే పొగ ఎన్నో రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేటి నుంచి స్మోకింగ్ మానేయండి.
5. పొగ తాగడం మానేయడం మొదట్లో కష్టంగానే అనిపించవచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు. భవిష్యత్తులో మీ ఆయుష్షు పెరగడానికి ఆరోగ్యకరంగా జీవించడానికి ఈ రోజే మీరు ఈ మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి.
6. ధూమపానం మీ జీవితాన్నే కాదు... మీపై ఆధారపడి ఉన్న జీవితాలను కూడా నశించేలా చేస్తుంది. మీరు ఒక్కరు ధూమపానం మానేస్తే మీ మీద ఆధారపడి ఉన్న అందరూ ఆరోగ్యకరంగా ఉంటారు.
7. మీరు... మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రేమిస్తే ధూమపానానికి నేడే నో చెప్పండి.
8. స్మోకింగ్ కాసేపు థ్రిల్లింగ్ గా ఉంటుంది. కానీ భవిష్యత్తులో మిమ్మల్ని కిల్ చేస్తుంది.
9. ధూమపానం ప్రాణం తీస్తుంది. మీ జీవితం నుండి సిగరెట్లకు స్థానం లేకుండా చేసుకోండి.
10. మిమ్మల్ని సంతోషంగా, ఆరోగ్యంగా, సజీవంగా ఉంచే విషయాలపై మీ సమయాన్ని, డబ్బును పెట్టుబడి పెట్టండి. పొగాకు మిమ్మల్ని చంపేందుకే ఉంది. దానికి దూరంగా ఉండండి.
11. మీరు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే స్మోకింగ్ మానడమే మార్గం, పొగాకును వదిలివేస్తే భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది.