IRCTC Thailand Tour : తక్కువ ధరలో థాయ్‌లాండ్ చుట్టేసి రావొచ్చు.. IRCTC ప్యాకేజీ ఇదే
IRCTC Thailand Tour Package Details : థాయ్‌లాండ్ చూడాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు చూసేద్దాం. తక్కువ ధరలో వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు.
IRCTC Thailand Tour Package Budget : ఇండియా కాకుండా ఇతర దేశాలు చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటివారికి ఐఆర్‌సీటీసీ(IRCTC) బెస్ట్ ఛాయిస్. తక్కువ ధరలో చాలా ప్రదేశాలు చూసి రావొచ్చు. కుటుంబంతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ఈ మేరకు IRCTC థాయ్‌లాండ్ టూర్ ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో ఉంది. ఈ ప్యాకెజీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..
శీతాకాలం మీరు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తే.. థాయ్‌లాండ్ బెటర్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. IRCTC ద్వారా భారతీయులుకు థాయ్‌లాండ్ వెళ్లి రావొచ్చు. ఇందులో మీకు వసతి, ఆహారం, రవాణా మొదలైన అనేక సౌకర్యాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ప్యాకేజీ ఎంచుకోండి.
IRCTC అంతర్జాతీయ హాలిడే టూర్ ప్యాకేజీలను ఎప్పటి నుంచో అందిస్తుంది. ఇందులో థాయిలాండ్ టూర్ ప్యాకేజీ కూడా ఒకటి. భారతదేశం నుండి థాయ్‌లాండ్‌కు((India To Thailand) ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ ప్యాకేజీ కింద ముంబయి నుంచి థాయ్‌లాండ్ వరకు పర్యటన ఉంది.
IRCTC థాయిలాండ్ టూర్ ప్యాకేజీ రూ. 67,330 నుండి ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి థాయ్‌లాండ్‌కు వెళ్లడానికి ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులు కలిపి ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.58,900గా నిర్ణయించారు. ఒకవేళ చిన్న పిల్లలను (5 నుంచి 11 ఏళ్లు) కూడా తీసుకెళ్లాలి అంటే.. రూ.55300గా ఉంటుంది.
థాయిలాండ్ టూర్ ప్యాకేజీలో జర్నీ, వసతి, ఆహారం వంటి ప్రయోజనాలను పొందుతారు. ఇది 5 పగళ్లు, 4 రాత్రుల టూర్ ప్యాకేజీ. ఇందులో టూరిస్టులు ముంబయి వెళ్లి.. బ్యాంకాక్, పట్టాయా వెళ్లేందుకు కూడా అవకాశం కల్పిస్తారు. ఇది కాకుండా, మీరు ఇతర ప్రసిద్ధ ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.
ఈ ప్యాకేజీలో హోటల్ వసతి, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ఉన్నాయి. ఇది కాకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో సహా టూర్ గైడ్ సౌకర్యం కూడా అందిస్తారు. జనవరి 10న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ముంబయి నుంచి విమానం ఉంటుంది. కొత్త ఏడాదిలో చిల్ అవ్వాలని అనుకుంటే ఈ బడ్జెట్ ప్యాకేజీని ట్రై చేయెుచ్చు. పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.