International Yoga Day 2023: కుర్చీకి అతుక్కుపోతున్నారా? ఈ యోగాసనాలు మీకోసమే
International Yoga Day 2023: మీ కదలిక లేని జీవితం వల్ల కలిగే అనారోగ్యాలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చెక్ పెట్టండిలా.
నిశ్చల జీవనశైలి శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నిశ్చల జీవనశైలి అంటే కదలిక లేని జీవనశైలిలో ఎక్కువ సేపు కూర్చోవడం, తక్కువ నడక లేదా కదలికలు ఉంటాయి. మన జీవితాల్లోకి వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి ప్రవేశించడంతో మనం ఎక్కువ భాగం ఒక మంచం లేదా ల్యాప్‌టాప్‌తో కూడిన కుర్చీకి పరిమితం అవుతున్నాం. ఇది చాలా ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది.
అక్షర యోగా సంస్థల వ్యవస్థాపకుడు యోగా మాస్టర్ అక్షర్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ ‘రోజంతా డెస్క్ జాబ్‌లో పనిచేసే వ్యక్తుల కోసం యోగా ఎక్కువ అవసరం. మీరు మీ రోజులో ఎక్కువ భాగం కంప్యూటర్ ముందు గడిపే వారైతే యోగా మీకు తప్పనిసరి. ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీరు ఫిట్‌గా ఉండాలి. మీ రోగనిరోధక శక్తిని అలాగే మీ బలం, ఓర్పును మెరుగుపరుచుకోవాలి..’ అని సూచించారు. యోగా మాస్టర్ అక్షర్ నిశ్చల జీవనశైలి యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి అనేక రకాల యోగా ఆసనాలను సూచించారు
సంతోలనాసనం: ఈ ఆసనం తొడలు, చేతులు, భుజాలను బలోపేతం చేయడంలో, ోర్ బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
చతురంగ దండసనం: ఈ ఆసనాన్ని రోజూ చేయడం వల్ల శరీరం యొక్క కండరాల పటిష్టతను పెంచడంలో సహాయపడుతుంది. మరింత అధునాతన ఆసనాల కోసం శరీరాన్ని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.
వశిష్టాసనం: ఈ ఆసనం చేతులు, భుజాలు, ఛాతీ, ఉదరం, కాళ్ల వెనుక పిక్కలు, చీలమండలను సాగదీయడంలో సహాయపడుతుంది. బలానికి, స్ట్రెచ్‌కు ఇది అవసరం.
చక్రాసనం: చక్రాల భంగిమ ఛాతీని విస్తరించడానికి, అడ్రినల్ గ్రంధులను ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది.
పశ్చిమోత్తాసనం: కూర్చుని కాళ్లు చాపి ముందుకు వంగి మీ బొటనవేళ్లను టచ్ చేయాలి. ఇది వెన్నెముక కదలికను పెంచడంలో సహాయపడుతుంది.
‘యోగా నిశ్చల జీవనశైలిని ఎదుర్కొంటుంది. ఇది శరీరాన్ని చురుగ్గా, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. కండరాల బలహీనత, కీళ్ల క్షీణత, వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో సహా అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుంది..’ అని యోగా మాస్టర్ అక్షర్ వివరించారు.