International Men's Day: మగవారి సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, ఈ రోజే ఎందుకు?-international mens day is celebrated every year to recognize the services of men why today ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  International Men's Day: మగవారి సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, ఈ రోజే ఎందుకు?

International Men's Day: మగవారి సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, ఈ రోజే ఎందుకు?

Haritha Chappa HT Telugu
Nov 19, 2024 09:52 AM IST

International Men's Day: నవంబర్ 19న ప్రతి ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నిర్వహించుకుంటాం. సమాజంలో పురుషుల సేవలను గుర్తిస్తూ, వారి మానసిక ఆరోగ్యానికి విలువిస్తూ ఇంటర్నేషనల్ మెన్స్ డే చేసుకుంటాం.

హ్యాపీ మెన్స్ డే
హ్యాపీ మెన్స్ డే (HT Photo)

ప్రపంచవ్యాప్తంగా సమాజానికి, కుటుంబాలకు పురుషులు చేసిన అమూల్యమైన సేవలను గుర్తిస్తూ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ముఖ్యంగా కుటుంబం, వివాహం, సమాజం, జాతి నిర్మాణం, పిల్లల సంరక్షణ వంటి అంశాలలో పురుషులు పాత్ర ఎంతో ముఖ్యమైనది. మహిళా దినోత్సవాన్ని ఎంత గౌరవంగా నిర్వహించుకుంటామో, పురుషుల దినోత్సవాన్ని కూడా సెలెబ్రేట్ చేసుకోవాలి. వారి పాత్రలను గుర్తించడానికి, దాన్ని నిర్వహించుకోవడానికి ఇది ఒక అవకాశమనే చెప్పుకోవాలి.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడు?

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 19 న నిర్వహించుకుంటారు. ఈ ఏడాది థీమ్ ‘పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్’. పురుషుల మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వారి కోసం వారు బహిరంగంగా మాట్లాడేందుకు వారిని ప్రోత్సహించాలి. మహిళల్లాగే పురుషులకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకు విలువ ఇవ్వాలి. మగవారు అభివృద్ధి చెందడానికి సహాయక వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం చరిత్ర

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 1992 లో ట్రినిడాడ్ కు చెందిన డాక్టర్ జెరోమ్ టీలక్సింగ్ ప్రారంభమైంది. పురుష ఆరోగ్యం, వారిపై జరిగే హింస గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు. మహిళల విజయాలను నిర్వహించుకోవడానికి ఒక రోజు ఉన్నట్టే, పురుషుల విజయాలను, సహకారాలను గుర్తించడానికి ఒక రోజును అంకితం చేశారు. అలా ఉద్భవించిందే నేషనల్ మెన్స్ డే . ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి నచ్చింది. ఎన్నో దేశాలు ఈ రోజును నిర్వహించుకోవడం మొదలుపెట్టాయి.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజున పురుషులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమాజంపై మగవారు చూపే సానుకూల ప్రభావాన్ని కూడా గుర్తించాలని ఈ ప్రత్యేక దినోత్సవం చెబుతోంది. ఇది మానసిక ఆరోగ్యం, స్టీరియోటైప్లను సవాలు చేయడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం వంటి క్లిష్టమైన సమస్యలను చర్చించడానికి పురుషులకు ఒక వేదికలా మారింది ఈ దినోత్సవం. పురుషులకు సామాజికంగా కలిగే ఒత్తిళ్ల గురించి పరిష్కరించేందుకు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.

స్వచ్ఛంద సేవ, సామాజిక సమావేశాలు, బహిరంగ ప్రచారాలు వంటి కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా నేషనల్ మెన్స్ డే నిర్వహించుకుంటారు. పురుషుల ఆరోగ్యం గురించి కొన్ని ఉచిత వైద్య తనిఖీలను చాలా చోట్ల ఏర్పడుచేస్తారు. విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేసి రోల్ మోడల్స్ గురించి వివరిస్తారు. సానుకూల విలువలను అవలంబించడానికి యువకులను ప్రేరేపిస్తాయి.

Whats_app_banner