Indian Army jobs:ఒకే నెలలో ఇండియన్ ఆర్మీలో 3 పెద్ద రిక్రూట్‌మెంట్‌లు..వివరాలివే!
Indian Army jobs: ఇండియన్ ఆర్మీ నుండి వరుస పెట్టి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఒకే నెలలో ఇండియన్ ఆర్మీలో 3 పెద్ద రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయ్యాయి
ఇండియన్ ఆర్మీ (Indian army) ఒక నెలలో మూడు పెద్ద రిక్రూట్‌మెంట్‌లను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మూడు రిక్రూట్‌మెంట్‌లలో అధికారుల స్థాయిలో ఉద్యోగాలను నియమాకం ఉండనుంది. మొదటి రిక్రూట్‌మెంట్ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్ పోస్టుల కాగా జూలై 26 నుండి,ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రెండోది SSC NCC స్పెషల్ ఎంట్రీ కింద ఆగస్టు 17 న రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. మూడవ రిక్రూట్‌మెంట్ SSC JAG (JAG) ఎంట్రీ స్కీమ్ క్రింద ఉండగా.. ఆగస్టు 24 నుండి దరఖాస్తులు ప్రారంభమవుతుంది. ఈ మూడు రిక్రూట్‌మెంట్ల సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తుల కోసం, అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ని సందర్శించండి.
1. SSC టెక్ మేల్, SSC టెక్ ఫిమేల్ కోర్సు
దీని కోసం దరఖాస్తులు 26 జూలై నుండి 24 ఆగస్టు 2022 వరకు తీసుకోబడతాయి.
అర్హత - ఇంజినీరింగ్ డిగ్రీ.
వయోపరిమితి - 20 నుండి 27 సంవత్సరాలు
2. SSC NCC స్పెషల్ ఎంట్రీ కోర్సు (పురుషులు, స్త్రీలు)
దీని కోసం ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 15, 2022 వరకు దరఖాస్తులు తీసుకోబడతాయి.
అర్హత: - కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్, NCC B లేదా C సర్టిఫికేట్
వయోపరిమితి - 19 నుండి 25 సంవత్సరాలు.
3. SSC JAG ఎంట్రీ స్కీమ్ కోర్సు (పురుషులు, స్త్రీలు) లా గ్రాడ్యుయేట్ల కోసం
దీని కోసం దరఖాస్తులు 24 ఆగస్టు నుండి 22 సెప్టెంబర్ 2022 వరకు తీసుకోబడతాయి.
అర్హత: - కనీసం 55% మార్కులతో LLB.అభ్యర్థి బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదుకు అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి - 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు.
పై మూడు రిక్రూట్‌మెంట్‌ల కోసం సవివరమైన సమాచారం కోసం, joinindianarmy.nic.in ని సందర్శించండి.
ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న మరిన్ని రిక్రూట్‌మెంట్‌లు
ఇండియన్ ఆర్మీ డెంటల్ కార్ప్స్‌లో
మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. SSC ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 14 ఆగస్టు 2022. BDS / MDS డిగ్రీ హోల్డర్ యువత ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీడీఎస్ చివరి సంవత్సరంలో 55 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి.
అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్
తాజాగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద ఆర్మీలో రిక్రూట్‌మెంట్ సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అభ్యర్థులు joinindianarmy.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మన్ (10వ తరగతి), ట్రేడ్స్‌మన్ పోస్టుల కోసం అగ్నివీర్లను నియమించనున్నారు. మొదటి దశలో భారత సైన్యంలో 25,000 మంది అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ కోసం ఆగస్టు రెండో వారంలో దేశవ్యాప్తంగా 80 ర్యాలీలు నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం