Hybrid Solar Eclipse 2023 | గురువారం అరుదైన సూర్యగ్రహణం.. విశేషం ఇదే!
Hybrid Solar Eclipse 2023: ఈ ఏడాదిలో అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం గురువారం సంభవించనుంది. దీని ప్రాముఖ్యత, గ్రహణ సమయం, తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Hybrid Solar Eclipse 2023: ఈ 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న, గురువారం నాడు సంభవించనుంది. ఇది మనకు తెలిసిన సూర్య గ్రహణాల కంటే విభిన్నమైనది. అందుకే దీనిని హైబ్రిడ్ సూర్యగ్రహణం అని పిలుస్తున్నారు. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినపుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకారం, ఈ సమయంలో భూమి ఉపరితలం వక్రంగా ఉన్నందున చంద్రుడి నీడ భూమిపై ఏటవాలుగా ప్రయాణిస్తుంది. ఆ నీడ గ్రహణం దశ ప్రపంచవ్యాప్తంగా మారుతుంది. అందుకే ఇది హైబ్రిడ్ సూర్యగ్రహణం అయింది.
అంతేకాకుండా ప్రస్తుత సూర్యగ్రహణం భూమి నుంచి చంద్రుడు దూరంగా ఉన్నప్పుడు సంభవిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు చాలా చిన్న పరిమాణంలో కనిపిస్తాడు. ఈ దృగ్విషయాన్ని నింగాలూ గ్రహణం (Ningaloo Eclipse) అని పిలుస్తారు.
Hybrid Solar Eclipse 2023 Date Time- హైబ్రిడ్ సూర్యగ్రహణం తేదీ, సమయం
హైబ్రిడ్ సూర్యగ్రహణం 2023 ఏప్రిల్ 20న సంభవిస్తుంది. ఉదయం 10:04 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 11:30 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గ్రహణం రెండు గంటలకు పైగా ఉంటుంది, సూర్యుడు పూర్తికోణంలోకి వచ్చినపుడు సంపూర్ణ సూర్యగ్రహణం వ్యవధి ఒక నిమిషం కంటే తక్కువ ఉంటుంది.
Hybrid Solar Eclipse 2023 in India- భారతదేశంలో సూర్యగ్రహణం
2023 సంవత్సరపు మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని చూస్తాయి. అయితే భారతీయ పసిఫిక్ మహాసముదం ప్రాంతంలో కొన్ని సెకన్లపాటు 'రింగ్ ఆఫ్ ఫైర్' కనిపిస్తుంది. చంద్రుడు సూర్యుని కేంద్రానికి మధ్యగా వచ్చినప్పుడు 'అగ్ని వలయం' ఏర్పడుతుంది.
ఎక్స్‌మౌత్ (పశ్చిమ ఆస్ట్రేలియా), తైమూర్ లెస్టె , వెస్ట్ పాపువా (ఇండోనేషియా) అనే మూడు ప్రదేశాలలో మాత్రమే సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. భారత ప్రామాణిక కాలమానం (IST) ప్రకారం సూర్యగ్రహణం ఉదయం 7:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది.
Rare Solar Eclipse 2023- అరుదైన సూర్యగ్రహణం
హైబ్రిడ్ సూర్యగ్రహణం ఒక శతాబ్దంలో కొన్ని సార్లు మాత్రమే సంభవిస్తుంది. చివరిసారి హైబ్రిడ్ సూర్యగ్రహణం 2013లో సంభవించింది. పదేళ్ల తర్వాత ఈ నెలలో సంభవించే సూర్యగ్రహణం 2023లో మొదటి హైబ్రిడ్ గ్రహణం అవుతుంది. తదుపరిది 2031లో సంభవిస్తుంది. ఆ తర్వాత వచ్చే శతాబ్దంలో మార్చి 23, 2164న ఇలాంటి హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని చూస్తారని నివేదికలు తెలిపాయి. అందుకే ఇది చాలా అరుదైన సూర్యగ్రహణం, అరుదైన ఖగోళ సంఘటన (rare celestial occurrence) గా చెబుతున్నారు.
How Many Eclipses in 2023- ఈ 2023లో మొత్తం గ్రహణాలు ఎన్ని
2023లో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. మొదటిది సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవిస్తుండగా, ఈ ఏడాదిలోనే మరొక సూర్యగ్రహణం అక్టోబర్ 14న సంభవిస్తుంది. అలాగే 2023లో మొదటి చంద్రగ్రహణం మే 5-6 తేదీల్లో సంభవిస్తుండగా, రెండవది అక్టోబర్ 28-29 తేదీలలో వస్తుంది.
సంబంధిత కథనం