మొబైల్ తయారీదారు హువావే నుంచి సరికొత్తగా Huawei Nova 10 SE అనే స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. గతంలో విడుదలైన Nova 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఉన్నట్లుగా కర్వ్‌డ్ డిస్‌ప్లేలు కాకుండా ఈ కొత్త ఫోన్ మోడల్ ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ర్యామ్, స్టోరేజ్ పరంగా Huawei Nova 10 SE ఫోన్ ఏకైక 8GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లో లభిస్తుంది. అయితే ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్ లోని గత మోడల్స్ దాదాపు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు ఉన్నాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్ Nova 10 లైనప్‌లో అత్యంత సరసమైన ధరలో లభించే ఫోన్‌గా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ హ్యాండ్‌సెట్ 7.39 మిమీ మందంతో, 184 గ్రాముల బరువుతో మెరిసే సిల్వర్ ప్యానెల్ డిజైన్ తో వచ్చింది. Nova 10 SEలో డ్యూయల్ సిమ్, Wi-Fi, బ్లూటూత్, GPS, USB-C వంటి సాధారణ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకోండి.
ఈ ఫోన్ Google యాప్‌లు , గూగుల్ సర్వీసులకు సపోర్ట్ చేయదు. అలాగే ఇది 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుందో లేదో కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఈ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆసక్తి కలిగినవారు, ప్రత్యామ్నాయ మోడల్స్ వైపు చూడటం మంచిది.
సంబంధిత కథనం