Wheat Flour Face Packs : చర్మానికి అద్భుతాలు చేసే గోధుమ పిండి ఫేస్ ప్యాక్స్.. ఇలా చేయాలంతే
Wheat Flour Benefits In Telugu : గోధుమ పిండిని మనం ఆహారంలో భాగంగా తీసుకుంటాం. అయితే గోధుమ పిండి చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. దీనితో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు.
గోధుమ పిండి ఫేస్ ప్యాక్ చర్మంపై అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇందులో ఉండే పీచు, విటమిన్లు, పోషకాలు అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. భారతీయుల ప్రధాన ఆహార పదార్థాలలో ఒకటైన గోధుమ పిండిలో చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి బలం లభిస్తుంది.
గోధుమ పిండి శరీరానికి సరైన ఆహారం, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. గోధుమ పిండి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఒక రకమైన మ్యాజిక్‌ను సృష్టిస్తుందని అంటారు. చర్మంలోని మలినాలను తొలగించడం, అవసరమైన మెరుపును పొందడంతోపాటు అనేక సమస్యలను దూరం చేయడం ద్వారా అందాన్ని మెరుగుపరుస్తుంది. మీరు సహజ సంరక్షణ పద్ధతి కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు ఉత్తమ పరిష్కారం. వివిధ రకాల చర్మ రకాలకు ఏయే రకాల గోధుమ పిండి ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చో వివరంగా తెలుసుకుందాం..
జిడ్డు చర్మం ఉన్నవారు
గోధుమ పిండి చర్మంపై ఉండే అదనపు నూనెను గ్రహిస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు గోధుమ పిండి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చక్కటి పరిష్కారాన్ని కనుగొనవచ్చు.
ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోండి. దానికి 3 టీస్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపండి.
అవసరమైతే పాలు వేసి చిక్కటి పేస్ట్‌లా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
దీన్ని ముఖంపై 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ రెమెడీని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది.
మెరిసే ముఖం కోసం
మీరు సహజ ఉత్పత్తులతో మీ ముఖం కాంతిని పెంచుకోవాలనుకుంటే, గోధుమ పిండి పేస్ ప్యాక్ మీకు ఉత్తమ పరిష్కారం.
ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల క్రీమ్ లేదా మలాయ్ తీసుకోండి. గోధుమ పిండిని వేసి మెత్తగా పేస్ట్‌లా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. దీన్ని ముఖంపై 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఎండతో చర్మ సమస్యల నుండి బయటపడటానికి
గోధుమ పిండిలో చర్మాన్ని పునరుజ్జీవింపజేసే ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉన్నాయి. దీనిని ఫేస్ ప్యాక్‌లాగా వేసుకుంటే ప్రయోజనాలు పొందుతారు.
రెండు టేబుల్ స్పూన్ల గోధుమపిండికి ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి కలపాలి. మిశ్రమం మెత్తని పేస్ట్ లాగా ఉండాలి.
ఈ మిశ్రమాన్ని ఎండతో కమిలిపోయిన ప్రభావిత ప్రాంతంపై రాయండి. 5-8 నిమిషాలు ఉంచాలి. తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి.
తర్వాత చల్లటి నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం ఈ రెమెడీని వారానికి రెండుసార్లు వర్తించండి.
వివిధ చర్మ సమస్యలకు
రుతువులను బట్టి చర్మంపై చిన్నపాటి చికాకులు, దురద, అలెర్జీలు సంభవిస్తూనే ఉంటాయి. వీటిని వదిలించుకోవడానికి గోధుమ పిండి ఫేస్ ప్యాక్ ఉత్తమ పరిష్కారం.
ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 4 టేబుల్ స్పూన్ల గులాబీ రేకులు, 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి కలపాలి.
మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మిశ్రమానికి తేనె, నీరు జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖం, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి.
15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది.
ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.