Oats chudva: ఓట్స్ చుడ్వా.. మీ ఆరోగ్యం పెంచే టేస్టీ స్నాక్-how to make oats chudva or chivda recipe for healthy snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Chudva: ఓట్స్ చుడ్వా.. మీ ఆరోగ్యం పెంచే టేస్టీ స్నాక్

Oats chudva: ఓట్స్ చుడ్వా.. మీ ఆరోగ్యం పెంచే టేస్టీ స్నాక్

Koutik Pranaya Sree HT Telugu
Sep 27, 2024 03:30 PM IST

Oats Chudva: సాయంత్రం పూట తినదగ్గ ఆరోగ్యకరమైన స్నాక్ ఓట్స్ చుడ్వా. ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఈ సింపుల్ స్నాక్ తయారీ చూసేయండి.

ఓట్స్ చుడ్వా
ఓట్స్ చుడ్వా (pinterest)

ఓట్స్‌తో చుడ్వా ఏంటీ అనుకోకండి. ఇది తింటే మామూలు చుడ్వా మర్చిపోతారు. తింటున్నప్పుడు ఓట్స్‌తో చేసినట్లు కూడా తెలీదు. సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఉత్తమ ఆప్షన్ ఇది. శరీరానికి ఫైబర్ తో పాటూ అనేక పోషకాలు అందుతాయి. తయారీ చూసేయండి. 

ఓట్స్ చుడ్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు ఓట్స్ 

2 చెంచాల నూనె

1 చెంచాడు పల్లీలు

1 చెంచాడు ఎండుద్రాక్ష

సగం టీస్పూన్ పంచదార

చిటికెడు ఇంగువ

2 పచ్చిమిర్చి, చీలికలు

1 కరివేపాకు రెమ్మ

అరచెంచా ఉప్పు

గుప్పెడు బాదాం

గుప్పెడు కాజూ

ఓట్స్ చుడ్వా తయారీ విధానం:

  1. అడుగు మందం ఉన్న కడాయి తీసుకోండి. దాంట్లో నూనె వేసుకుని వేడిచేయండి. 
  2. అందులో ఓట్స్ వేసి సన్నం మంట మీద వేయించాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఓట్స్ కాసేపటికి ముదురు బంగారు వర్ణంలోకి మారతాయి. వాసన కూడా తెలుస్తుంది. క్రిస్పీగాను అవుతాయి. అప్పుడు స్టవ్ కట్టేయండి. ఓట్స్ ఓ పల్లెంలోకి తీసుకోండి. 
  3. అదే కడాయిలో నూనె వేసుకుని పల్లీలు వేయించుకోండి. అందులోనే బాదాం, జీడిపప్పు కూడా వేసి వేయించుకోండి. ఎండు ద్రాక్ష కూడా వేసి ఉబ్బిపోయే దాకా ఆగండి. ఇవన్నీ ఓ పల్లెం లోకి తీసుకోండి. 
  4. మరి కాస్త నూనె వేసి వేడెక్కాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి. కాస్త ఇంగువ, పంచదారా కలపండి. 
  5. అందులోనే ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలపండి. తర్వత ఓట్స్ కూడా వేసేయండి. 
  6. కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి అన్నీ బాగా కలుపుకోండి. 
  7. స్టవ్ కట్టేసేయండి. అంతే.. ఓట్స్ చుడ్వా రెడీ. 

 

 

టాపిక్