Beetroot Hair Pack : జుట్టు ఆరోగ్యానికి బీట్‌రూట్ ఎలా ఉపయోగించాలి?
Beetroot Benefits For Hairs : కొన్ని కూరగాయలు మన చర్మానికి, జుట్టుకు చాలా మేలు చేస్తాయి. బీట్‌రూట్ అలాంటి వాటిలో ఒకటి. జుట్టుకు బీట్‌రూట్ ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..
బీట్‌రూట్ ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ 'సి' పుష్కలంగా ఉన్నాయి. ఇది తినడం వల్ల చర్మం దెబ్బతింటుంది. జుట్టు రాలడాన్ని(Hair Loss) కూడా తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లోని పోషకాలు చర్మానికి హానిని తగ్గిస్తాయి.
బీట్‌రూట్ ముడతలు, నల్ల మచ్చలు, వృద్ధాప్య ఇతర సంకేతాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చర్మం మెరుపును పెంచుతుంది. బీట్‌రూట్ రసం(Beetroot Juice)లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టు(Healthy Hair) పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌లోని బీటాలైన్స్ చర్మానికి రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. ఫలితంగా మీ చర్మం మెరుస్తుంది.
బీట్‌రూట్‌లో యాంటీ అలర్జీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలు, ఇతర చర్మ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. బీట్‌రూట్ రసం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం, ఐరన్, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్న బీట్ రూట్.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
బీట్‌రూట్‌లోని ప్రొటీన్, విటమిన్ 'ఎ', కాల్షియం వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహకరిస్తాయి. ఇది కాకుండా బీట్ రూట్.. స్కాల్ప్ రంధ్రాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఒక చెంచా బీట్ రూట్ రసంలో రెండు చెంచాల పెరుగు మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించవచ్చు.
బీట్ రూట్ తో మరో హెయిర్ ప్యాక్(Beetroot Hair Pack) కూడా తయారు చేసుకోవచ్చు. మెుదట వేప ఆకులు, బీట్ రూట్ కడగాలి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి. ఇది కూడా జుట్టుకు అప్లై చేయెుచ్చు.
అంతేకాదు.. బీట్ రూట్ తీసుకుని పైన తొక్క తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమం నుంచి జ్యూస్ వడకట్టాలి. ఒక బౌల్ తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ పోసి కలిపి.. జుట్టుకు అప్లై చెయెుచ్చు.
జుట్టు ఆరోగ్యానికి బీట్ రూట్‍తో మరో రకమైన ప్యాక్ కూడా చేసుకోవ్చచు. దీనికోసం అరకప్పు బీట్ రూట్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కూడా కలపాలి. బాగా మిక్స్ చేసి తలకు పెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు ఉంచి.. కడగాలి. ఈ హెయిర్ ప్యాక్ వారానికి రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు. అయితే ఏదైనా కొత్త పద్ధతిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించడం మరిచిపోవద్దు.