Banana Payasam: అరటి పండు పాయసం నైవేద్యం.. శ్రావణ మాసం స్పెషల్-how to make banana payasam naivedyam for shravana masam ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Payasam: అరటి పండు పాయసం నైవేద్యం.. శ్రావణ మాసం స్పెషల్

Banana Payasam: అరటి పండు పాయసం నైవేద్యం.. శ్రావణ మాసం స్పెషల్

HT Telugu Desk HT Telugu
Aug 23, 2023 07:02 AM IST

శ్రావణ మాసంలో ఇష్ట దైవానికి ఏ నైవేద్యం పెట్టాలని ఆలోచిస్తున్నారా? అరటి పండు పాయసం రెసిపీ ప్రయత్నించండి. ఇది చాలా ఆరోగ్యకరమైన రెసిపీ కూడా.

అరటి పండు పాయసం రెసిపీ
అరటి పండు పాయసం రెసిపీ

శ్రావణమాసం వచ్చేసింది. ఈ సమయంలో మీరు వివిధ రకాల వంటకాలు తయారు చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే నైవేద్యం అయినా ఎలాంటి స్పెషల్ డేకి అయినా పాయసం అనేది తప్పక ఉండాల్సిన వంటకం. అయితే దీనిని కేవలం బియ్యంతోనే చేస్తారు. అయితే మీరు కొత్తగా లేదంటే హెల్తీగా ఏమైనా రెసిపీని ప్రయత్నించాలనుకుంటే అరటిపండు పాయసం మీకు బెస్ట్ ఆప్షన్.

పాయసం అనేది భారతదేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన సాంప్రదాయ రెసిపీలలో ఒకటి. అందుకే దీనిని ప్రతి ముఖ్యమైన సందర్భాల్లో చేసుకుంటారు. అయితే మీరు చేసుకునే పాయసం మీకు చక్కని రుచినే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందంటే మీరు నమ్ముతారా? అయితే ఇప్పుడు నమ్మండి. అరటిపండుతో చేసే టేస్టీ టేస్టీ పాయసం మీకు అద్భుతమైన రుచిని అందిచడమే కాకుండా మీకు చక్కని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిచనుంది.

అరటిపండు పాయసం పూర్తిగా పోషకాలతో నిండి ఉంటుంది. పిండిపదార్థాలు, పొటాషియం, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉండే, ఆరోగ్యకరమైన ఈ డిష్ తీసుకోవడం వల్ల మీరు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఇది మీకు శక్తిని అందించడమే కాకుండా.. జీర్ణశక్తిని పెంచుతుంది. బరువు తగ్గడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. మధుమేహం వంటి ఇతర జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంతకీ ఈ అరటిపండు పాయసం ఎలా తయారు చేయాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

అరటిపండు - 2

పాలు - 1 లీటర్

బెల్లం - 150 గ్రాములు

నట్స్ - తగినన్ని

కుంకుమ పువ్వు - చిటికెడు

అరటి పండు పాయసం తయారు చేసే విధానం

  1. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై మందపాటి కడాయి ఉంచండి. దానిలో పాలు వేసి బాగా మరిగించండి.
  2. దానిలో మెత్తని అరటిపండు మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. పాల మిశ్రమం క్రీమ్‌గా మారేవరకు బాగా కలుపుతూ ఉండండి.
  3. ఇప్పుడు దానిలో సన్నగా తరిగిన నట్స్ వేయండి. పాయసం రంగు మార్చాలనుకుంటే దానిలో కుంకుమ పువ్వు వేయొచ్చు.
  4. తరువాత కాస్త బెల్లం వేసి కలపాలి. అరటిపండు ద్వారా వచ్చే తీపిదనం మీకు సరిపోతుందనుకుంటే మీరు పూర్తిగా బెల్లం వేయడం మానేయొచ్చు.
  5. స్టవ్ ఆఫ్ చేసి దానిని ఒక గిన్నెలోకి తీసుకుని అరటిపండు ముక్కలతో గార్నిష్ చేసి నైవేద్యంగా పెట్టండి.
  6. అరటిపండు పాయసం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. శ్రావణ మాసం పూజలకు విచ్చేసే అతిథులకూ దీనిని వడ్డించొచ్చు. ఆరోగ్యకరమైన అల్పాహారంగానూ తీసుకోవచ్చు. మితంగా తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

Whats_app_banner