Weight loss | వ్యాయామం చేయకుండా బరువు ఎలా తగ్గాలి?-how to lose weight without doing exercise and here the tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss | వ్యాయామం చేయకుండా బరువు ఎలా తగ్గాలి?

Weight loss | వ్యాయామం చేయకుండా బరువు ఎలా తగ్గాలి?

Maragani Govardhan HT Telugu
Feb 28, 2022 02:31 PM IST

వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా వెయిట్ తగ్గవచ్చు. అయితే ఈ పని చెప్పినంత తెలికేం కాదు. అంతేకాకుండా వ్యాయామం చేయాలంటే కనీసం 30 నిమిషాల సమయం, ఎంతో సంకల్ప శక్తి అవసరం. బిజీగా ఉన్న రోజుల్లో ఇలా కుదరకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో లక్ష్య సాధన క్లిష్టతరమవుతుంది.

<p>బరువు తగ్గడం</p>
బరువు తగ్గడం (Unsplash)

అధిక బరువు.. నేటి కాలంలో ఎంతో మందిని వేధిస్తోన్న సమస్య. జన్యు కారణాలతో పాటు ఆధునిక జీవన శైలి, ఆహార పద్ధతుల వల్ల చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి బరువు తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన, సమతూల్య ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా వెయిట్ తగ్గవచ్చు. అయితే ఈ పని చెప్పినంత తెలికేం కాదు. అంతేకాకుండా వ్యాయామం చేయాలంటే కనీసం 30 నిమిషాల సమయం, ఎంతో సంకల్ప శక్తి అవసరం. బిజీగా ఉన్న రోజుల్లో ఇలా కుదరకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో లక్ష్య సాధన క్లిష్టతరమవుతుంది. అంతేకాకుండా కుటుంబ వ్యవహారాలు, పనిభారం వల్ల క్రమశిక్షణగా నిబద్ధతతో వ్యాయామం చేయలేకపోవచ్చు.

మరీ బరువు ఎలా తగ్గించుకోవాలి..

వ్యాయామం చేయడానికి సమయం ఎక్కువ పడుతుందని మీరు భావిస్తే కేలరీలు బర్న్ చేయడానికి సమయం పడుతుందని మీరు ముందుగానే అంగీకరించాలి. పూర్తి స్థాయి శారీరక శ్రమ లేకుండా మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కాబట్టి శారీరక శ్రమ లేకుండానే ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలితో బరువు తగ్గించుకుని లక్ష్య సాధనతో పాటు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇందుకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొవ్వు నుంచి శక్తి వినియోగం..

శరీరం ప్రధానంగా కాలేయం, మూత్రపిండాల్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఈ రెండు అవయవాలు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌లో పనిచేస్తాయి. అంటే మనం తీసుకునే ఆహారం తక్కువగా ఉండి రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉంటే కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజ్‌కు బదులు నిల్వ ఉన్న కొవ్వును శరీరం కరిగిస్తుంది. ఫలితంగా ఈ కొవ్వు కాలేయంలో మరింత విచ్ఛిన్నమవడమే కాకుండా ఇది ఫ్యాటీ యాసిడ్‌గా మారుతుంది. దీని నుంచి వచ్చే శక్తిని శరీరం ఉపయోగించుకుంటుంది.

ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది?

ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో కార్బోహైడేట్లు, ప్రోటీన్లు మితంగానే ఉంటాయి. కాబట్టి వ్యాయామం లేకుండా బరువు తగ్గించుకోవలనుకుంటే శరీరం కార్బహైడేట్లు, ప్రోటీన్ల నుంచి కాకుండా కొవ్వును కరిగించి శక్తిగా మార్చుకుంటుంది. అప్పుడే వెయిట్ తగ్గడం సాధ్యమవుతుంది. పైన పేర్కొన్న ప్రక్రియ జరుగుతుంది. శరీరం కాలేయంలో ఏర్పడిన ఫ్యాటీ యాసిడ్ల నుంచి శక్తిని తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అధిక కొవ్వు ఆమ్లాలను(Excessive Fatty Acids) కీటోన్‌లుగా బయటకు పంపుతుంది.

బరువు తగ్గే ప్రక్రియ..

తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు కొవ్వు విచ్ఛిన్న ప్రక్రియ సులభతరమవుతుంది. అందువల్ల శరీర పనితీరు, అవసరాలు, శక్తి ఉత్పత్తి చేయడానికి కొవ్వు కరిగించడం గొప్ప మార్గం. ఈ విధంగా చేయడం ద్వారా జీవక్రియ ప్రభావవంతంగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్లు కంటే కొవ్వు దాని శక్తి కంటెంట్ లేదా ఇంధన విలువను నెమ్మదిగా కోల్పోతుంది. కాబట్టి వ్యాయామాన్ని భర్తీ చేస్తుంది.

ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి..

ఆహారం తక్కువగా తీసుకోవడమనేది మీరు బరవు కోల్పోవడానికి సహాయపడే ప్రభావవంతమైన జీవనశైలి మార్పు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అంటే వెయిట్ తగ్గడం కోసం కడుపు మాడ్చుకోవడం, ఆకలితో ఉండటం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఆహారం మితంగా తీసుకోవాలీ, కానీ తినకుండా ఉండకూడదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి బరువు తగ్గడం మంచిది కాదు. హెల్త్‌కు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతే ఇవ్వాలి.

Whats_app_banner

సంబంధిత కథనం