Dry Clothes Without Sun : ఎండ లేకపోయినా చలికాలంలో బట్టలు ఆరబెట్టుకోవడం ఎలా?
Dry Clothes Without Sun : శీతాకాలం వచ్చిందంటే చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య బట్టలు ఆరకపోవడం. సూర్యుడు రాకుంటే బట్టలు ఆరకపోవడమే కాదు.. చెడు వాసన కూడా వస్తాయి. దీని నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
Dry Clothes Without Sun Tips : చలికాలంలో సూర్యరశ్మి చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది.. సూరీడు.. సూరీడు ఏడ పోయినవ్ అని ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. అయినా కనిపించడు. అప్పుడప్పుడు మెరుపు తీగల కనిపిస్తూ వెళ్లిపోతాడు. రోజూ మెుత్తం ఉంటే అయిపోవు.. బట్టలు ఆరేవి అని బాధపడతాం. నిజానికి శీతాకాలంలో బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారుతుంది. అయితే దీనికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ఎండ లేకపోయినా సులభంగా ఆరబెట్టవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం..
1. బయట సూర్యరశ్మి లేకపోతే లోపల ఉన్న వైర్‌కు బట్టలు వేలాడదీసి, బట్టలు ఉన్న చోట ఫ్యాన్‌ను నడపాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
2. సువాసనతో కూడిన అగరబత్తిని వెలిగించి, మీరు బట్టలు ఆరబెట్టిన గది మూలలో ఉంచండి. దీని పొగ బట్టల నుండి తడి వాసనను తొలగించడమే కాకుండా త్వరగా ఆరిపోయేలా చేస్తాయి. అలాగే బట్టలు ఉతికేటప్పుడు 2 చెంచాల వెనిగర్ ని నీళ్లలో కలపాలి.
3. బట్టలు ఉన్న గదిలో ఉప్పు నింపిన బ్యాగ్ ఉంచండి. తద్వారా ఉప్పు బట్టలలోని తేమను గ్రహించి వాటిని ఆరబెట్టడానికి సహాయపడుతుంది. ఇది పని చేస్తుంది.
4. ఇంటి లోపల బట్టలు ఆరేస్తే.. కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. ప్రత్యేక హ్యాంగర్లపై బట్టలు వేలాడదీయండి. దీనివల్ల బట్టల ద్వారా గాలికి ఆరిపోతాయి.
5. బట్టలు ఉతికిన తర్వాత వాటిని రెండుసార్లు మెషిన్ లో ఆరేస్తే బట్టలు త్వరగా ఆరిపోతాయి.
6. మీరు మీ వాషింగ్ మెషీన్ నుండి బట్టలను తీసివేసినప్పుడు, వాటిని డ్రైయర్‌లో ఆరబెట్టి, ఆపై వాటిని విడిగా వైర్‌పై వేలాడదీయండి. ఇది బట్టలు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది.
7. బయట ఎండ లేకపోయినా దుర్వాసన రాకుండా బయట ఆరబెట్టండి. తర్వాత తీసుకొచ్చి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరేయండి. ఇంట్లో కూడా వేలాడదీయడానికి ఏర్పాట్లు చేయండి.
8. మీరు మీ హెయిర్ డ్రైయర్‌తో లోదుస్తులు, సాక్స్, రుమాలు వంటి కొన్ని చిన్న దుస్తులను సులభంగా ఆరబెట్టవచ్చు. రూం హీటర్‌లో బట్టలు ఆరబెట్టినట్లయితే, అది ప్రయోజనకరంగా ఉంటుంది.
9. మీరు త్వరగా బయటకు వెళ్లాలని, జీన్స్‌ను ఆరబెట్టాలనుకుంటే వాటిని ఐరన్ బాక్స్ తో నొక్కండి. అయితే జీన్స్ ఇస్త్రీ చేస్తే త్వరగా పాడైపోతుంది, కానీ ఒకసారి ఇస్త్రీ చేస్తే ఏమీ జరగదు.