Pregnancy test: ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ రాకముందు.. ఇంట్లోని పదార్థాలనే ఇలా వాడేవారు
Pregnancy test: ప్రెగ్నెన్సీ చెక్ చేయడానికి సాధారణంగా కిట్ వాడతారు. అయితే ఇవి లేకముందు ఇంట్లోనే కొన్ని మార్గాల ద్వారా గర్భధారణను నిర్ధారించుకునేవాళ్లు. ప్రెగ్నెన్సీ కిట్ లేకుండా ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోదగ్గ పద్ధతులేంటో చూడండి.
పీరియడ్స్ రావాల్సిన తేదీ కన్నా రెండ్రోజులు ఆలస్యమైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ గుర్తొస్తుంది. ప్రెగ్నెన్సీ రావాలి అనుకునేవారికీ, పిల్లల్ని కనడం వాయిదా వేద్దాం అనుకునేవారికీ ఇది చాలా పెద్ద విషయం. అయితే ప్రెగ్నెన్సీ కిట్స్ అందుబాటులో లేనప్పుడు కొన్ని సహజ పద్ధతులు గర్భధారణ నిర్దారించుకోడానికి వాడేవారు.
ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లో మహిళ మూత్రంలో ఉండే హెచ్‌సీజీ స్థాయుల బట్టి ఫలితాలొస్తాయి. ఆ హార్మోన్ ప్రెగ్నెన్సీలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్ ఆధారంగానే ఈ ఇంటి పరీక్షలూ పనిచేస్తాయి. వీటిలో కొన్ని మార్గాలు ఇప్పటికీ అనుసరిస్తున్నవే.
సహజంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే మార్గాలు:
1. పంచదారతో:
ఇది ప్రెగ్నెన్సీ కిట్స్ అందుబాటులో లేనప్పటి నుంచి పాతకాలం నుంచీ వాడుతున్న ఒక మార్గం. ఒక గిన్నెలో చెంచాడు పంచదార తీసుకుని అంతే మూత్రాన్ని కలపాలి. పంచదార ముద్దగా మారితే ప్రెగ్నెన్సీ నిర్ధరణ అయినట్లే. ఎందుకంటే మూత్రంలో ఉండే హెచ్‌సీజీ హార్మోన్ పంచదారను నీటిలో సరిగ్గా కరగనివ్వదు. అలా కాకుండా పంచదార వేగంగా కరిగిపోతే ప్రెగ్నెన్సీ లేదని అర్థం.
2. ఉప్పుతో:
ఇది కూడా పంచదారతో చేసిన టెస్ట్ మాదిరిగానే చేయాలి. బదులుగా ఉప్పు వాడాలంతే. నిమిషం ఆగాక ఉప్పు కాస్త ముద్దలు కట్టినట్లు మారితే టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లే. లేదంటే ప్రెగ్నెన్సీ లేదని అర్థం. అయితే ఈ టెస్ట్ గురించి ఎలాంటి శాస్త్రీయ నిర్దారణ మాత్రం లేదు. కాకపోతే పాతకాలం నుంచి పాటిస్తున్న పద్ధతుల్లో ఇదీ ఒకటి.
3. బేసల్ బాడీ టెంపరేచర్:
మీరు విశ్రాంతి తీసుకున్నప్పుడు మీ శరీర అతి తక్కువ ఉష్ణోగ్రతే బేసల్ బాడీ టెంపరేచర్. సాధారణంగా దీన్ని ఉదయం లేవగానే చెక్ చేసుకుంటారు. అండం విడుదలయ్యే సమయంలో ఈ ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలో ప్రొజెస్టిరాన్ స్థాయులు పెరగడమే దీనికి కారణం. ఒకవేళ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే రెండు వారాల వరకు ఇదే ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది కూడా ఒక సహజ మార్గమే.
4. డిశ్చార్జి:
ప్రెగ్నెన్సీ నిర్ధరణ కోసం యోని నుంచి వచ్చే డిశ్చార్జిని గమనించవచ్చు. ఒకవేళ మీరు గర్భంతో ఉంటే ఈ డిశ్చార్జి కాస్త చిక్కగా, సాధారణంగా కంటే క్రీమీగా అవుతుంది. గర్భధారణ తర్వాత కొన్ని రోజులకు ఈ మార్పు వస్తుంది. మీ పీరియడ్ తప్పగానే ఈ లక్షణం మరింత స్పష్టంగా తెలుస్తుంది. దీనికోసం టిష్యూ వాడి ఒకసారి డిశ్చార్జి చెక్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ ఇప్పుడు కూడా వాడగలిగేంత కచితత్వం కలది.
5. బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాను, మూత్రాన్ని సమాన నిష్ఫత్తిలో తీసుకుని కలపాలి. కొన్ని నిమిషాల పాటూ ఆగాలి. మూత్రంలో హెచ్‌సీజీ హార్మోన్ ఉంటే అది బేకింగ్ సోడాతో చర్య జరుపుతుంది. సోడాలో కనిపించినట్లు బుడగలు వస్తే ప్రెగ్నెన్సీ నిర్దారణ అయినట్లే.
ఈ టెస్టులన్నీ చాలా సులభంగా చేసుకునేవే. కానీ వీటన్నింటికీ ఎలాంటి శాస్త్రీయ నిరూపణలు లేవు. అందుకే వీటిని ముందుగా ఒకసారి పరీక్షించుకోడానికి వాడితే పరవాలేదు. కానీ, వీటిమీదే పూర్తిగా ఆధార పడకూడదు.
సాధారణ ప్రెగ్నెన్సీ లక్షణాలు:
ఈ టెస్టుల ద్వారానే కాకుండా.. ప్రెగ్నెన్సీ తనతో కొన్ని ప్రత్యేక లక్షణాలనూ మోసుకొస్తుంది. అవేంటో చూడండి.
- ఉదయం లేవగానే వాంతులవ్వడం, వికారంగా, తల తిరిగినట్లు అవ్వడం ముఖ్య లక్షణాలు. ఆరో వారం నుంచే ఈ లక్షణాలు కొద్ది మందిలో మొదలవుతాయి.
- రొమ్ముల్లో మార్పులు కూడా గమనించవచ్చు. సున్నితంగా మారతాయి. ఉబ్బినట్లు అనిపిస్తుంది. చనుమొన చుట్టూ ఉంటే ఏరియోలా భాగం రంగు ముదురు రంగులోకి మారుతుంది.
- తరచూ మూత్రానికి వెళ్లాలనిపిస్తుంది. 6 నుంచి 8 వారాల మధ్యలో ఈ లక్షణం కనిపించొచ్చు.
టాపిక్