DIY Facials । ముఖం తాజాగా కనిపించాలా? ఇంట్లోనే ఈ ఫేషియల్స్ ట్రై చేయండి!
Homemade Facials: అలసిపోయి, నిస్తేజంగా మారిన మీ ముఖాన్ని తాజాగా, రిఫ్రెష్ గా కనిపించేలా చేయడానికి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్‌లు కొన్ని ఉన్నాయి
Homemade Facials: మీరు ఆరోగ్యంగా ఉన్నారా, లేదా? ఆనందంగా ఉన్నారా, లేదా? అనేది మీ ముఖాన్ని చూసి చెప్పేయచ్చు. ఎక్కువసేపు ఎండలో తిరిగితే ముఖం వాడిపోతుంది. అలాగే ప్రతిరోజూ పని ఎక్కువై, నిద్ర తక్కువైనపుడు కూడా అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మీ ముఖాన్ని నిస్తేజంగా కనిపించేలా చేస్తుంది. మీరు కూడా నీరసంగా, అలసిపోయినట్లుగా ఉంటారు. ఇలాంటి సందర్భంలో మీరు ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా ఉపయోగం ఉండదు. మీరు ఎంత అందంగా ముస్తాబైనా, ఎంత చక్కగా డ్రెస్ వేసుకున్నా డల్ గానే కనిపిస్తారు.
అలసిపోయి, నిస్తేజంగా మారిన మీ ముఖాన్ని కొన్ని ఇంటి చిట్కాలతో పునరుజ్జీవింప చేయవచ్చు. మీ ముఖం తాజాగా, రిఫ్రెష్ గా కనిపించేలా చేయడానికి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్‌లు కొన్ని ఉన్నాయి. వాటిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
DIY Rosewater Honey Banana Facial- రోజ్ వాటర్, అరటి, తేనె ఫేస్ మాస్క్
ఈ మాస్క్ అలసిన మీ చర్మాన్ని తక్షణమే కాంతివంతంగా, రిఫ్రెష్ మారుస్తుంది. సుమారు 2 టీస్పూన్ల తేనెతో సగం అరటిపండును కలిపి పేస్ట్ చేయండి. తర్వాత కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకున్న తర్వాత ముఖానికి అప్లై చేయాలి. అరటిపండులోని విటమిన్లు, తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మానికి పోషణ ఇస్తాయి, రోజ్ వాటర్ హైడ్రేట్ చేస్తుంది. ఇలా ఈ ఫేస్ ప్యాక్ చర్మం రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది.
DIY Olive Honey Coffee Mix Facial- ఆలివ్ నూనె, కాఫీ, తేనె మాస్క్
ఒక చెంచా తేనె, కాఫీ, ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖం, మెడపై అప్లై చేయండి. కనీసం 30 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం వారానికి రెండుసార్లు దీన్ని అప్లై చేయండి.
DIY Coconut Milk Saffron Facial- కొబ్బరి పాలు- కుంకుమపువ్వు మాస్క్
మెరిసే చర్మం కోసం కుంకుమపువ్వు ఉత్తమంగా పనిచేస్తుంది. కొబ్బరి పాలు మాయిశ్చరైజింగ్ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి రెండు కలిపి చేసిన ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే మీ ముఖంలో నిగారింపుతో కూడిన మెరుపు వస్తుంది. ఒక కప్పు కొబ్బరి పాలలో చిటికెడు కుంకుమపువ్వును వేసి ఐదు నిమిషాల పాటు మరిగించి, చల్లారనివ్వండి. ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను సరిగ్గా అప్లై చేయాలి. మీ ముఖం మీద కాసేపు ఉంచి, నీటితో శుభ్రం చేసుకోండి.
సంబంధిత కథనం