Home Made Blushes : పింక్, మెరిసే చర్మం పొందాలంటే.. ఈ బ్లష్​లు ట్రై చేయండి..-home made blushes for shiny and pinky and glowing skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Made Blushes : పింక్, మెరిసే చర్మం పొందాలంటే.. ఈ బ్లష్​లు ట్రై చేయండి..

Home Made Blushes : పింక్, మెరిసే చర్మం పొందాలంటే.. ఈ బ్లష్​లు ట్రై చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 03, 2022 05:01 PM IST

Home Made Blushes : ప్రతి అమ్మాయికి తన చర్మం మెరుస్తూ ఉండాలని.. పింక్​గా ఉండాలని.. కోరుకుంటుంది. అయితే రసాయనిక బ్లష్​లు మీ స్కిన్​ని పాడు చేస్తాయి. కాబట్టి.. సహజమైన బ్లష్​లు ఉపయోగిస్తే మంచిది. వాటిని ఎలా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజమైన బ్లష్ ఇలా తయారు చేసుకోండి..
సహజమైన బ్లష్ ఇలా తయారు చేసుకోండి..

Home Made Blushes : ఇంట్లో తయారుచేసిన బ్లష్‌లు మీ బుగ్గలకు సహజమైన గులాబీ రంగును అందిస్తాయి. అంతేకాకుండా అవి మీ స్కిన్​ను కాపాడుతాయి. దీనికోసం ఎక్కువ బ్లష్ వేసుకోవాల్సిన పని కూడా లేదు. కొన్ని స్వైప్‌లు తక్షణమే మీ ముఖాన్ని ప్రకాశవంతం చేస్తాయి. యవ్వన మెరుపును అందిస్తాయి. మీ ఛాయను ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.

ఇది లేత లేదా మెరిసే చర్మంను అందిచడంలో సహాయం చేస్తుంది. ఇది సహజమైన రూపాన్ని ఇస్తుంది. పైగా రసాయనిక బ్లష్‌లు ఎక్కువ ఖరీదైనవి. అయితే కొన్ని సహజ పదార్థాలతో ఇంట్లోనే బ్లష్​లు తయారు చేసుకోవచ్చు. పింక్ గ్లో కోసం ఇంట్లో బ్లష్​లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్‌రూట్ బ్లష్

ఫ్యూషియా అందమైన షేడ్​తో నిండిన బీట్‌రూట్.. మీ బుగ్గలకు సహజమైన రంగును అందిస్తుంది. అంతే కాకుండా మీ చర్మానికి తేమను, పోషణను అందిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా, లోపలి నుంచి మెరిసేలా చేస్తాయి.

బీట్‌రూట్ పొడి, యారోరూట్ పొడిని కలపండి. యాక్టివేట్ చేసిన చార్​కోల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని అవసరమైనప్పుడు మీ బుగ్గలకు అప్లై చేయండి.

మందార, దాల్చిన చెక్క బ్లష్

యారోరూట్ పౌడర్​లో విటమిన్ సి, దాల్చినచెక్క, అల్లం లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ సహజమైన బ్లష్ మీ చర్మానికి చాలా బాగుంటుంది. దీనిలోని ముఖ్యమైన నూనెలు మీ చర్మానికి పోషణను అందిస్తాయి. మంచి సువాసనను అందిస్తాయి.

యారోరూట్ పొడి, మందార పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపండి. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, సుగంధ ద్రవ్యాల నూనె వేసి బాగా కలపండి. మీ బుగ్గలపై దీనిని బ్లష్​గా ఉపయోగించవచ్చు.

గులాబీ రేకుల బ్లష్

ఈ రోజ్ పెటల్ నేచురల్ బ్లష్ అన్ని రకాల చర్మాలపై ఉపయోగించడం సురక్షితం. అది మీరు ఇష్టపడే ఆరోగ్యకరమైన పింక్ గ్లోని ఇస్తుంది. తాజా గులాబీ రేకులు, స్టార్చ్‌ను మోర్టార్‌లో వేసి.. చక్కటి మిశ్రమం వచ్చేవరకు గ్రైండ్ చేసేయండి. రెండు గంటలపాటు వేడిచేసిన ఓవెన్‌లో బ్లష్‌ను ఆరబెట్టండి. అంతే మీ సహజ బ్లష్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.

షియా వెన్న, చిలగడదుంప బ్లష్

ఈ నేచురల్ క్రీమ్ బ్లష్ మీ బుగ్గలకు కొంత అదనపు షైన్, మెరుపుని ఇస్తుంది. ఇది ఎక్కువసేపు అలాగే ఉంటుంది. షియా బటర్, బీస్వాక్స్​ను మృదువైనంత వరకు వేడి చేయండి. అలోవెరా జెల్ వేసి బాగా కలపండి. స్టవ్ ఆపేసి.. చిలగడదుంప పొడి, కోకో పౌడర్ వేసి బాగా కలపాలి. దానిని చల్లార్చి, పింక్ రంగు కోసం మీ బుగ్గలకు అప్లై చేయండి.

బీస్వాక్స్, కొబ్బరి నూనె బ్లష్

కేవలం మూడు పదార్థాలతో తయారు చేసిన ఈ బ్లష్.. మీ బుగ్గలకు మంచి పోషణను అందించడమే కాకుండా.. కొద్దిసేపటికే మీకు గులాబీ రంగును అందిస్తుంది.

తురిమిన బీస్వాక్స్‌ను మైక్రోవేవ్‌లో 30 సెకన్ల పాటు వేడి చేయండి. కొబ్బరి నూనె వేసి బాగా కలపండి.15 సెకన్ల పాటు మైక్రోవేవ్​లో వేడి చేయండి. అది చల్లారిన తర్వాత.. బ్లష్ పింక్ ఐషాడో పౌడర్ వేసి బాగా కలపండి. ఇది మీకు మంచి గ్లో ఇస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం