లోకల్ లాంగ్వేజ్‌లో మీ ఆధార్‌ను అప్డేట్ చేయాలకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!
ఆధార్ కార్డును అప్‌డెట్ చేసే సమయంలో చాలా వరకు భాష సమస్యగా మారుతుంది. చాలా మందికి ఇంగ్లీష్ తెలియకపోవడం వల్ల అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో కష్టంగా మారుతుంది. ఆన్‌లైన్‌లో కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మీ స్థానిక భాషలో మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డెట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు భారతీయ పౌరులకు అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ చేయబడిన ఈ కార్డ్ అనేక వ్యవహరాల్లో కీలకంగా పరిగణించబడుతుంది. బ్యాంక్ ఖాతా తెరవడం నుండి ప్రభుత్వ పథకాల ఫలాలు పొందడం వరకు, దాదాపు ప్రతిచోటా ఇది అవసరం. అయితే ఆధార్ కార్డ్‌లోని పొరపాట్ల వల్ల చాలా పనులకు అటంకం కలుగుతుంది. కాబట్టి, మీ ఆధార్ కార్డ్‌లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడం లేదా అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
UIDAI వెబ్‌సైట్ లేదా ఆధార్ కేంద్రంలో మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ సమయంలో భాష సమస్యగా మారుతుంది. చాలా మందికి ఇంగ్లీష్ తెలియకపోవడం వల్ల అడిగిన సమాచారాన్ని ఇవ్వడం కష్టంగా మారింది. ఆన్‌లైన్‌లో కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మీ స్థానిక భాషలో మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డెట్ చేసుకోవచ్చు.
స్థానిక భాషలో ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకునే విధానం
- UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను https://uidai.gov.in/సందర్శించండి.
- '‘Self-service update’ ' కింద ఉన్న ‘Aadhaar service section’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయండి.
- సెప్టీ కోడ్‌ను నమోదు చేసి, అవసరమైన ఇతర వివరాలను ఇవ్వండి.
- OTPపై క్లిక్ చేయండి
- OTPని నమోదు చేసిన తర్వాత మీకు కొత్త పేజీ కనిపిస్తుంది. ఇక్కడ, మీరు ''update data button''పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు, మీరు ప్రాంతీయ భాషను ఎంచుకున్న తర్వాత వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
- మరోసారి మీరు ఇక్కడ నమోదు చేయవలసిన OTPని పొందుతారు.
- వివరాలను చూసిన తర్వాత, మీరు టిక్ చేసి, ఆపై ప్రొసీడ్ బటన్‌ను నొక్కాలి.
- వివరాలను అప్‌డేట్ చేసే సమయంలో రూ. 50 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
ఈ స్టేప్స్‌ను అనుసరించడం ద్వారా, మీరు మీ స్థానిక భాషలో ఏదైనా సమాచారాన్ని అప్‌డెట్ చేయవచ్చు. ముఖ్యంగా, అయితే మార్పులకు మీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ అవసరం. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయకూడదనుకుంటే, మీరు మీ సమీప UIDAI కేంద్రాన్ని సందర్శించవచ్చు. అక్కడ మీరు ఒక ఫారమ్‌లో మీరు మీ ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయాలనుకుంటున్న అన్ని వివరాలను సమర్పించాలి.
సంబంధిత కథనం