Dreams and Meanings : ఎక్కువగా వచ్చే కలలు ఇవే.. ఏది వస్తే ఏం జరుగుతుంది?
Dreams and Meanings : మంచి లేదా చెడు కల.. ఏది వచ్చినా మీకు కొన్ని సూచనలను ఇస్తుంది. ఏ కల వస్తే ఎలాంటిదో అర్థం తెలుసుకుందాం..
కలలు సహజం. మీకు మంచి కలలు వచ్చినా, చెడు కలలు వచ్చినా అవన్నీ ఒక సంకేతం ఇస్తాయి. ప్రతి కలలోని నిజానిజాలు తెలుసుకోవాలని అందరూ తహతహలాడుతుంటారు. మీరు మీ కలలకు సంబంధించిన రహస్యం కోసం కూడా తెలుసుకోవచ్చు. కలల వాస్తవికతను అర్థం చేసుకోవడానికి స్వప్న శాస్త్రం ఉపయోగపడుతుంది. మంచి, చెడు కలల కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం..
ఒక వ్యక్తి చిరిగిన పాత బట్టలతో కలలో తనను తాను చూసినట్లయితే లేదా అతని శరీరం నుండి చెట్టు పెరగడం ప్రారంభించినట్లయితే, ఈ కల అతనికి చాలా చెడ్డది. దాని ప్రభావాలను వదిలించుకోవడానికి, ఒక వ్యక్తి వెంటనే సూర్య భగవానుని పూజించడం ప్రారంభించాలి.
ఆవు, సింహం లేదా ఏనుగుతో తనను తాను చూడటం చాలా మంచిదని భావిస్తారు. ఈ కల ద్వారా మీరు దేవుని ఆశీర్వాదం పొందుతారు.
మీకు కలలో యజ్ఞం కనిపిస్తే, ఈ కల ప్రభావాల నుండి బయటపడటానికి, మీరు గంగా లేదా మరేదైనా పవిత్ర నది ఒడ్డున కూర్చుని యజ్ఞం చేయాలి. మీకు రాజభవనాలు, కోటలు లేదా ఎత్తైన పర్వతాలు కలలో కనపడితే అప్పుడు అది చాలా శుభప్రదం. మీ జీవితంలో త్వరలో ఆనందం, శ్రేయస్సు రాబోతుందని అర్థం.
ఆవు పేడ, వెంట్రుకలు, పొడి గడ్డి, బూడిద, విరిగిన పాత్రలు, కలలో మానవ లేదా జంతువు యొక్క మృతదేహం చెడ్డ శకునం. ప్రయాణాన్ని విరమించుకుని విష్ణువును పూజించండి.
కలలో పామును చంపడం లేదా హింసించడం, పెళ్లికి హాజరు కావడం, మాంసాహారం తినడం ఇవన్నీ చెడు కలలు. వాటి పర్యవసానాలు మనిషి మాత్రమే అనుభవించాలి.
ఒకరి మరణం గురించి కలలు వస్తే చాలా మంచిది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
కలలో చేపలు కనపడితే.. ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అదే మాంసం తిన్నట్టుగా వస్తే.. మీకు గాయాలు అవుతాయని అర్థం.
కాళ్లు, చేతులు కడుగుతున్నట్టుగా కనిపిస్తే.. మీకున్న అన్ని దు:ఖాలు, సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.
కలలో మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టుగా అయితే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయని తెలుసుకోవాలి. కలలో పాలు తాగుతున్నట్టుగా కనిపిస్తే.. అదే ఫలితం ఉంటుంది. నీరు తాగుతున్నట్టుగా కనిపిస్తే.. ఐశ్వర్యం రాబోతోందని అర్థం.