Tips To Lose Fat | ఎక్కువ కష్టపడకండి.. చిన్న చిన్న మార్పులు చేయండి..
ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించాలంటే.. సన్నగానే ఉండాలి అనుకుంటున్నారు. వ్యాయామం చేస్తూ సరైన పద్ధతిలో బరువు తగ్గితే ప్రాబ్లం లేదు. కానీ.. డైట్లతో కడుపు మాడ్చుకుని అనారోగ్య పాలవడమే కరెక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. కఠినమైన డైట్ పాఠించకపోయినా.. కొవ్వును ఎలా సులభంగా పోగొట్టుకోవచ్చో సలహాలు ఇస్తున్నారు.
Weight Lose Tips | ఓ మనిషి ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉన్నాడా లేదా అనేకంటే.. లావుగా ఉన్నాడా, బక్కగా ఉన్నాడా అని ఆలోచించే రోజుల్లో ఉన్నాము. ఈ ఆలోచనతోనే స్లిమ్‌గా కనిపించాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్లంటూ, డైట్లంటూ ఏవేవో ప్రయత్నిస్తున్నారు. కానీ చిన్న చిన్న అపరాదాల వల్ల కూడా బరువు పెరుగుతారని.. వాటిని నియంత్రించాలని మాత్రం ఆలోచించట్లేదు. కారణాలు చిన్నవే అయినా.. జరిమానా పెద్దగానే ఉంటుంది అన్నట్లు ఉంటాయి. కాబట్టి మీరు ఆ చిన్న తప్పులేంటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని బరువు తగ్గండి.
తినేప్పుడు శ్రద్ధ వహించండి..
టీవీ చూస్తున్నప్పుడు లేదా సినిమాలు చూస్తూ తినడం వల్ల మీ దృష్టి తిండి మీద నుంచి మారిపోతుంది. ఫలితంగా ఎక్కువ తినేస్తారు. ఈ క్రమంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోకుండా ఉండాలంటే.. మీరు తినేంత వరకు ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. దీంతో ఆహారాన్ని ఎక్కడవరకు ఆపాలో తెలుస్తుంది.
చిన్న ప్లేట్‌లో తినండి
చిన్న ప్లేట్‌లో తింటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ మొత్తంలో తినడం సాధ్యమవుతుంది. చిన్న ప్లేట్‌లో ఆహారాన్ని చూస్తే.. ప్లేట్ నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. తద్వారా తెలియకుండానే తక్కువ తింటాము.
నీరు తాగండి
భోజనానికి ముందు పుష్కలంగా నీరు తాగి.. తినడానికి కూర్చోండి. అప్పుడు తక్కువ తింటాము. మీరు బాగా ఆకలితో ఉన్నా.. నీరు తాగడం వల్ల మీ ఆకలి కాస్త తీరుస్తుంది. కాబట్టి సహజంగా బరువు తగ్గడానికి నీరు తాగడం సమర్థవంతమైన, ఆరోగ్యకరమైన మార్గం అని డైటీషియన్లు పేర్కొంటున్నారు.
జ్యూస్ లేదా కోలాకు దూరంగా ఉండండి
మీరు లిక్విడ్ క్యాలరీలను తాగడం కొనసాగించినట్లయితే.. మీ శరీరంలో కొవ్వు స్థాయిలు మీ మాట వినవు. కాబట్టి ఏ రకమైన జ్యూస్ లేదా కోలాకు దూరంగా ఉండండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
ఎక్కువ నడవాలి
ఒకే చోట ఎక్కువసేపు కూర్చుంటే పొట్ట పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే అప్పుడప్పుడు విరామం తీసుకుని కాస్త నడవాలి. చదువుకుంటున్నా.. ఆఫీసులో పని చేసినా.. టీవీ చూస్తున్నా.. గంటల కొద్దీ కూర్చున్న తర్వాత ఒక్కోసారి వాకింగ్ చేయడం చాలా ముఖ్యం.
సంబంధిత కథనం