Cheese Egg Roll । కేవలం రెండే రెండు నిమిషాల్లో మీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ, ఇదిగో రెసిపీ!
Cheese Egg Roll Recipe: బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు టైం లేదా? రెండు నిమిషాల్లో చీజ్ ఎగ్ రోల్ రెడీ చేసుకోండి. రెసిపీ ఇక్కడ ఉంది.
సూపర్ ఫాస్ట్ గా సిద్ధం చేసుకునే రెసిపీలు చూస్తే అందులో కచ్చితంగా గుడ్డుతో చేసినవి ఉంటాయి. గుడ్డును గిలక్కొట్టి రెండే రెండు నిమిషాల్లో రుచికరమైన ఆమ్లెట్ చేసుకోవచ్చు, ఇందులోనూ బ్రెడ్ ఆమ్లెట్, కొరియన్ ఆమ్లెట్ అంటూ రకాలు ఉన్నాయి. మీకు ఇక్కడ పరిచయం చేసే రెసిపీ కూడా ఇలాగే చాలా సులభంగా, త్వరితగతిన చేసుకోవచ్చు. అదే చీజ్ ఎగ్ రోల్.
బిజీ వారాలలో సమయం ఎక్కువగా లేనపుడు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా సాయంత్రం స్నాక్స్ లాగా తినేయవచ్చు. చీజ్ ఎగ్ రోల్ చేయటానికి పెద్దగా పదార్థాలేమి అవసరం లేదు. ఆమ్లెట్ లో చీజ్ వేసి చుట్టేయడమే. అయితే తయారీ విధానంలో కొద్ది మార్పులు చేసుకుంటే రుచిగా ఉంటుంది. చీజ్ ఎగ్ రోల్ తయారీకి కావలసిన పదార్థాలు, ఎలా తయారు చేయాలో ఈ కింద చూడండి.
Cheese Egg Roll Recipe- కావలసిన పదార్థాలు
- 2 గుడ్లు
- 1/4 టీ స్పూన్ ఉప్పు
- 1/4 టీస్పూన్ మిరియాల పొడి లేదా కారం
- 1 తురిమిన చీజ్ క్యూబ్
- 1 టీస్పూన్ ఆలివ్ నూనె
చీజ్ ఎగ్ రోల్ తయారీ విధానం
- గుడ్లను పగలగొట్టి తెల్లసొన, పచ్చ సొనను వేరు చేయండి.
- ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి.
- ముందుగా గుడ్డులోని తెల్లసొన భాగాన్ని ఆమ్లెట్ లాగా చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి
- ఇప్పుడు పచ్చసొనపై జున్నువేసి వేడి చేసి తెల్లటి ఆమ్లెట్ తో మడవండి.
అంతే చీజ్ ఎగ్ రోల్ రెడీ. సర్వ్ చేసుకోండి, రుచిని ఎంజాయ్ చేయండి.
సంబంధిత కథనం