ఆహార ప్రియులకు.. ఆకుకూరలతో అదరహో అనిపించే టేస్టీ రెసిపీలు!
మన భారతీయ వంటకాల్లో మంచి రుచితో పాటు, ఆరోగ్యాన్ని పంచే శాఖాహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలోనూ ఆకుకూరాలతో వండే వంటకాలు ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఆకుకూరలు మంచి పోషక విలువలు, ఔషధగుణాలకు నెలవైనవి.
ఆహార ప్రియులకు రోజుకో కొత్త రుచిని ఆస్వాదించాలని ఉంటుంది. తమ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడానికి ఘుమఘుమలాడే వంటకాల కోసం ఆరాటపడుతుంటారు. మన భారతీయ వంటకాల్లో మంచి రుచితో పాటు, ఆరోగ్యాన్ని పంచే శాఖాహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలోనూ ఆకుకూరాలతో వండే వంటకాలు ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఆకుకూరలు మంచి పోషక విలువలు, ఔషధగుణాలకు నెలవైనవి. వీటితో వండే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి.
మీరు ఎప్పుడూ కొత్త రోజులను ఆస్వాదించాలనుకునే ఆహార ప్రియులైతే, మీ కోసం ఆకుకూరలతో రుచికరమైన వెరైటీ రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాం. వీలైతే మీరూ ఒకసారి వీటిని ప్రయత్నించి చూడండి, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
1. తోటకూర పులుసు
తోటకూర పులుసు ఒక తెలుగు స్టైల్ వంటకం. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఒకసారి ఈ పులుసు రుచిచూసినవారు మాత్రం, తమ డైలీ మెనూలో ఈ వంటకాన్ని చేర్చేసుకుంటారు. ఈ వంట ఇప్పటి జనరేషన్‌కు కొత్తగా అనిపించినప్పటికీ, నిన్నటితరం వారికి మాత్రం ఇది చాలా సుపరిచితం. తోటకూర పులుసును రుచికరంగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు :-
తోట కూర - మూడు కట్టలు
ఉల్లిపాయలు - 3
చింతపండు పులుసు - చిన్న కప్పు
మెంతి పొడి - 1 స్పూన్
నూనె - 2 స్పూన్లు
ఆవాలు - 1/2 చెంచా
శనగపప్పు - 2 స్పూన్లు
ఎండు మిర్చి - 4
పచ్చి మిర్చి - 5
కారం - 1/2 చెంచా
ఉప్పు - తగినంత
కరివేపాకు - తగినంత
వెల్లులి రెబ్బలు - 10
పసుపు - చిటికెడు
తయారీ విధానం :-
ముందుగా ఉల్లిపాయలని సన్నగా పొడవుగా తరుగుకోవాలి. తోట కూరని కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసి, కాస్త వేడి కాగానే ఆవాలు, శనగ పప్పు, ఎండు మిర్చి వేయాలి. శనగపప్పు వేగిన తర్వాత పచ్చి మిర్చి, కరివేపాకు వేసి ఇవి కొంచెం వేగగానే ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక తోట కూరను వేసి బాగా కలపాలి. ఇదే సమయంలో వెల్లుల్లి పాయలు కూడా వేయాలి. తోటకూర కొంచెం వేగాక చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉంచి, ఆ తర్వాత మెంతి పొడి, కారం వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించి దించాలి. వేడి వేడి తోట కూర పులుసు రెడీ.
2. తోటకూర మసాలా పప్పు
పప్పును మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. తోటకూరతో మసాల పప్పు చేసి చూడండి.
కావలసిన పదార్థాలు:
తోటకూర: 4 కట్టలు,
పెసర పప్పు: 1 కప్పు
వెల్లుల్లి: ఎనిమిది
ఉల్లిపాయలు: మూడు
టామాటాలు: నాలుగు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం: 2 టీస్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూను
ధనియాలపొడి: 1 టీస్పూను
నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా
తయారుచేసుకునే విధానం
గిన్నెలో కడిగిన పెసరపప్పుని తీసుకుని బాగా ఉడికించాలి. తర్వాత మందపాటి గిన్నె తీసుకుని దానిలో నెయ్యి వేసి వేయించాలి. తర్వాత అల్లంను,ఉల్లిముక్కలను వేసి వేగిన తర్వాత కట్ చేసిన టామాటాలను అందులో వేసి ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, కారం వేయాలి. ఆ మిశ్రమంలో ధనియాల పొడిని, వెల్లుల్లి వేసి బాగా కలపాలి. చివరిలో తరిగిన తోటకూర వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించి.. ఇప్పుడు మెుదటిగా ఉడికించిన పెసరపప్పును వేసి రెండు నిమిషాలు తర్వాత కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది.
3. పాలక్ పనీర్
చాలా మంది శాఖాహారులు ఇష్టపడే రెసిపీ పాలక్ పన్నీర్. పాలకూర ప్యూరీలో పనీర్ క్యూబ్స్ వేసి చేసే ఈ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి రెస్టారెంట్ మెనూ కార్డ్‌లో కనిపించే కామన్ రెసీపి ఇది. మరి ఇంతటి రుచికరమైన వంటకాన్ని ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం.
పాలక్ పనీర్‌కు కావలసినవి
5-6 పాలకూర కట్టలు
15-16 పనీర్ క్యూబ్స్
2 టేబుల్ స్పూన్లు నూనె
1 స్పూన్ జీలకర్ర
1 బిరియాని ఆకు
అల్లం ముక్కలు
సన్నగా తరిగిన 1 స్పూన్ వెల్లుల్లి,
1 కప్పు ఉల్లిపాయ పేస్ట్
1/2 కప్పు టొమాటో ముక్కలు,
2 స్పూన్స్ ఉప్పు
1/2 స్పూన్ గరం మసాలా
1/2 స్పూన్ ఎర్ర మిరియాల పొడి
1/2 స్పూన్ ధనియాల పొడి
ఏలకులు
ఎలా తయారు చేయాలి
కట్ చేసిన పాలకూర ఆకులను పావుకప్పు నీళ్లలో ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టి తర్వాత వాటిలో పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్టు చేయండి.
మూకుడు తీసుకుని అందులో నూనె వేడి చేసి తర్వాత పనీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
ఇప్పుడు అందులో నుంచి పనీర్ క్యూబ్స్ తీసివేసి, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపుకోండి.
కొద్దిసేపు ఆగి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. వాటిని గులాబీ-గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి.
ఎర్ర మిరియాలు,కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి, బాగా కలపండి
ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసి మీడియం వేడి మీద వేయించాలి.
తర్వాత పాలకూర పేస్ట్ వేసి 2-3 నిమిషాలు వేయించాలి.
చివరిగా మిక్సీలో వేయించిన పనీర్ క్యూబ్స్ వేసి, పాలక్ గ్రేవీతో కలిసేవరకు తిప్పండి.
అందులో 1 tsp నెయ్యి, కావాలంటే ఫ్రెష్ క్రీం వేసి కలిపండి.. అప్పుడు రెసీపికి మంచి టేస్టు వస్తుంది.
4. కలగలుపు ఆకుకూర :
ఇది వివిధ రకాల ఆకుకూరలతో కలిపి చేసే వంటకం. ఇందులో చుక్కకూర, మెంతికూర, తోటకూర, పాలకూరలను కలగలపి ఈ రెసీపిని తయారు చేస్తారు. ఇన్ని ఆకుకూరలతో కలిపి చేసే వంటకాన్ని ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం...
కావలసినవి
చుక్కకూర: 1 కట్ట
మెంతికూర: 1 కట్ట
తోటకూర: 1 కట్ట
పాలకూర: 2 కట్టలు
కొత్తిమీర: 1 కట్ట
శనగపప్పు: 2 టేబుల్‌స్పూన్లు
ఉల్లిపాయ: ఒకటి
నూనె: 2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
ధనియాలపొడి: 1 టేబుల్‌స్పూను
పచ్చిమిర్చి (తురిమినది): 1 టేబుల్‌స్పూను
వెల్లుల్లి (తురిమినది): 1 టేబుల్‌స్పూను
అల్లం (తురిమినది): 1 టేబుల్‌స్పూను
తయారు చేసుకునే విధానం
ముందుగా శనగపప్పు నానబెట్టాలి. ఆ తర్వాత నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి అందులో అల్లంవెల్లుల్లి తురుము వేయాలి
ఆపై తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలతో పాటు ఉప్పు, పసుపు వేసి వేగించాలి
ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసి ఓ రెండు నిమిషాల వరకు వేయిస్తుండాలి.
ఇక నుంచి తరిగిన ఆకుకూరలు (మెంతికూర, చుక్కకూర, తోటకూర ) వేసి ఐదు నిమిషాల వరకు ఉడికించాలి.
చివరిగా పాలకూరను ఉప్పుతో కలిపివేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.
ఆ తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర తురుమును పైన చల్లాలి.
సంబంధిత కథనం