Cholesterol: సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే చిట్కాలు!-healthy high fat foods to keep you full and satisfied ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Healthy High-fat Foods To Keep You Full And Satisfied

Cholesterol: సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే చిట్కాలు!

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 04:33 PM IST

Low fat diet for high cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే , గుండె జబ్బులు , మూత్రపిండాల సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. . కావున శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం అవసరం.

Cholesterol
Cholesterol

శరీరంలో తగినంత కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండడం చాలా ముఖ్యం. ఇది హార్మోన్ల ఉత్పత్తికి, సెల్ గోడలను ఫ్లెక్సిబుల్‌గా ఉంచడం వంటి ముఖ్యమైన విధుల్లో సహాయపడుతుంది. అదే సమయంలో, శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే , గుండె జబ్బులు , మూత్రపిండాల సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల లేదా కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు . కొలెస్ట్రాల్ లైపోప్రొటీన్ల కలయికతో ఉంటుంది. LDL కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణను నిరోధిస్తుంది . దీంతో తీవ్ర అనారోగ్య పరిస్థితి కారణం కావచ్చు. కావున శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం అవసరం. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి కొన్ని సహజ మార్గాలను తెలుసుకుందాం.

క్రమం తప్పకుండా వ్యాయామం

వ్యాయామం శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. తేలికపాటి వ్యాయామం కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ప్రమాదం నుండి కాపాడుతుంది.

కరిగే ఫైబర్ తీసుకోవడం

సోయాబీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, పండ్లు, ఇతర తృణధాన్యాలు కరిగే ఫైబర్‌కు మూలాలు. వాటిని తీసుకోవడం వల్ల శరీరం నుండి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడే బ్యాక్టీరియా ప్రోబయోటిక్‌కు సహాయసడుతుంది.

మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్

ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, ట్రీ నట్స్, అవకాడోస్ వంటి మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అదే సమయంలో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

అసంతృప్త కొవ్వు తీసుకోవడం

అన్ని అసంతృప్త కొవ్వులు ఆరోగ్యకరమైనవి అయితే, ఒమేగా-3 అనేది పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు, ఇది గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తుంది, ఇది మొత్తం శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.

ఆరోగ్యకరమైన బరువు

బరువు తగ్గడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ పెరుగుతుంది.

ట్రాన్స్‌ ఫ్యాట్స్ నిర్వహణ

ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, అదే సమయంలో హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం

WhatsApp channel

సంబంధిత కథనం