Hugging | వీలైతే హగ్ ఇవ్వండి డ్యూడ్.. మహా అయితే ఒత్తిడి తగ్గుతుంది..
అప్పుడప్పుడు మనసుకి బాధగా ఉన్నప్పుడు పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ సమయంలో వారి చెప్పే మాటలు, ఒక హగ్ మనకు ఓదార్పునిస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హగ్. ఈ హగ్ అనేది చిన్న పిల్లలనుంచి.. 60 ఏళ్ల ముసలివారి వరకు కూడా చాలా అవసరం. మన ప్రేమను వారికి వ్యక్తం చేయగలిగే ఏకైక మార్గం హగ్.
Heal Yourself With A Hug | మనసులోని బాధను చెరిపేసే శక్తి స్పర్శకు ఉంటుంది. మన శరీరం అప్పుడప్పుడు శారీరక ఆప్యాయత కోసం ఎదురుచూస్తుంది. ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు.. ఇది కూడా ఒకటి. హగ్గింగ్ అనేది మన ఎండోక్రైన్ వ్యవస్థలో స్థాయిలను మార్చగలదని 2013లో ఓ అధ్యయనం పేర్కొంది. ఎండోక్రైన్ వ్యవస్థ రక్తప్రవాహంలోకి హార్మోన్లను స్రవించే గ్రంధులతో తయారై ఉంటుంది. ఈ గ్రంధులలో పీనియల్ గ్రంధి, ప్యాంక్రియాస్, హైపోథాలమస్, అండాశయాలు.. మొదలైనవి ఉంటాయి. దీనివల్ల హగ్ చేసుకున్నప్పుడు హార్మోన్ల స్థాయిలు మారి.. మనకు మరింత ఓదార్పునిస్తుందని అధ్యయనం వెల్లడించింది. కౌగిలించుకున్న సమయంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుందని పరిశోదకులు వెల్లడించారు. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, ఆనందం పెంచడానికి, బంధాన్ని పెంపొందించడానికి సహాయం చేస్తుందని పేర్కొన్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించడానికి హగ్గింగ్ ఒక శక్తివంతమైన సాధనం అంటున్నారు.
జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ, అందర్ ధరత్ దెబ్బకు ఖాళీ అని శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో మన మెగాస్టార్ చెప్పాడు కదా. కాబట్టి మీరు కూడా మీకు నచ్చిని వ్యక్తికి, లేదా మీ దగ్గర వారికి రోజూ ఓ హగ్ ఇవ్వండి. ఇది వారి ఇబ్బందులను మరిచిపోయేలా చేస్తుంది. అంతేకాకుండా మీ మధ్య సంబంధాన్ని పెంచుతుంది. ఒక హగ్‌తో లో ఒత్తిడి తగ్గతుందంటే.. ఇవ్వడానికి ఏముంది.
సంబంధిత కథనం