Wednesday Motivation : మగాడి మనసు గాలిపటం.. కాపాడేందుకు ఆడదే ఆ'దారం'
Wednesday Motivation : మాగాడి జీవితంలో మహిళ లేకుంటే చాలా కష్టం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పురుషుడిని నడిపించేది మహిళ. సంతోషంలో స్నేహితురాలిలా, బాధలో అమ్మలాగా తోడుంటుంది తను. ఆమె లేకుంటే.. పురుషుడు లేడు. అసలు బతకాలన్న ఆశే లేదు.
మహిళ.. తల్లిగా లాలిస్తుంది.. చెల్లిగా తోడుంటుంది.. భార్యగా బాగోగులు చూస్తూ ఉంటుంది. నీ ఆరోగ్యం సరిగా లేకుంటే.. డాక్టర్ అవుతుంది.. కుటుంబ భారాన్ని మోస్తూ.. సర్వం త్యాగం చేస్తుంది. అందుకే ఆమెకు అవనికి ఉన్నంత ఓపిక. ఆమె లేనిదే సృష్టి లేదు. ఆమె లేనిదే.. ఆనందం లేదు. ఆమె లేనిది బతుకే లేదు.
పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకూ మహిళ లేకుండా పురుషుడి జీవితం శున్యం. గాలిపటంలాంటి మగాడి మనసుకు దారం లాంటి ఆధారం ఆమె. ఆమె లేకపోతే.. జీవితం ఎటు పయనిస్తుందో తెలియదు. ప్రతి ఒక్క విషయంలో పురుషులకు తోడుగా నిలుస్తుంటుంది. కేవలం ఆమె కోరుకునేది కాస్తంత ప్రేమ, ఓదార్పు, తోడు. ఎంతైనా.. ఆమె శక్తి అపారం... ఆమె యుక్తి అమూల్యం.. ప్రేరణ ఆమే.. లాలనా ఆమే.. తల్లిగా.. చెల్లిగా.. తోడుగా... నీడగా.. ఆమె పాత్ర అనితరసాధ్యం.. ఆమె లేకుంటే అంతా శూన్యం.. అందుకే ఆమెకు శతకోటి వందనాలు..
మహిళ నేర్వేలేని విద్య లేదు.. ఆమెకు రాని పని లేదు.. ఆమె చేతుల కదలిక ఓ అద్భుతం.. ఇంట్లో వినిపించే ఆమె కాళ్ల పట్టీల చప్పుడు గొప్ప సంగీతం.. ఆమె సంతోషంతో నవ్వితే.. ఇల్లంతా నక్షత్ర చినుకులు రాలి వెన్నెల పారుతుంది. ఇంట్లో ఆకలి ఉందని తెలిస్తే.. అన్నపూర్ణై కడుపులు నింపుతుంది. అందుకే ఆమె గొప్పది.
భరించడంలో భూదేవి అంతటోళ్లు..
నడిపించడంలో నాయకులకు తీసిపోరు..
మగాడి మనసు ఎగిరే గాలిపటం..
అదుపు తప్పకుండా చూసేందుకు ఆడదే ఆధారం..
జననం నీవే.. గమనం నీవే..
సృష్టివి నీవే.. కర్తవు నీవే..
కర్మవు నీవే.. ఈ జగమంతా నీవే..
భగవంతుడు అన్ని చోట్లా ఉండలేడు కదా..
అందుకే ప్రతీ ఇంట్లో నువ్ ఉన్నావ్..
ఓ మహిళా నీకిదే మా వందనం..
Happy Women's Day