Teachers Day Wishes 2024: గురు సాక్షాత్ పరబ్రహ్మ, మీకు చదువు చెప్పిన గురువులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి-happy teachers day 2024 telugu wishes for whatsapp and facebook status ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Teachers Day Wishes 2024: గురు సాక్షాత్ పరబ్రహ్మ, మీకు చదువు చెప్పిన గురువులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Teachers Day Wishes 2024: గురు సాక్షాత్ పరబ్రహ్మ, మీకు చదువు చెప్పిన గురువులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Haritha Chappa HT Telugu
Sep 05, 2024 05:00 AM IST

Teachers Day Wishes 2024: ఉపాధ్యాయ దినోత్సవం ఎంతో ప్రత్యేక సందర్భం. మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను స్మరించుకుని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాల్సిన రోజు. హ్యాపీ టీచర్స్ డే 2024 సందేశాలు, కోట్స్, శుభాకాంక్షలు ఇక్కడ మేము ఇచ్చాము. వీటిని మీ టీచర్లకు షేర్ చేయండి.

టీచర్స్ డే విషెస్
టీచర్స్ డే విషెస్ (shutterstock)

ఏ వ్యక్తి ఎదగడానికైనా వారి ఉన్నతిలో గురువుదే ప్రత్యేక స్థానం. మంచి ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందించడంతో పాటు తన విద్యార్థి వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. అతనికి సరైన మార్గనిర్దేశం చేస్తాడు. గురువు పట్ల హృదయంలో దాగి ఉన్న గౌరవాన్ని, ప్రేమను వ్యక్తీకరించడానికి మనదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు. అప్పటి నుండి ఈ రోజును భారతదేశంలో ఉపాధ్యాయులకు గౌరవ సూచకంగా నిర్వహించుకోవడం మొదలుపెట్టాము. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ ఉపాధ్యాయుడికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలనుకుంటే, ఈ హ్యాపీ టీచర్స్ డే 2024 సందేశాలు, కోట్స్, శుభాకాంక్షలు వినియోగించుకోండి.

టీచర్స్ డే 2024 శుభాకాంక్షలు

  1. పిల్లల్లో జ్ఞాన విత్తనాన్ని నాటిన రైతు ఉపాధ్యాయుడు

ఆ విత్తు వల్ల విద్యార్థులు జీవితాంతం ఫలాలను పొందుతారు.

హ్యాపీ టీచర్స్ డే!

2. గురువు భగవంతునితో సమానం

గురువు విద్యార్థుల జీవితాల్లోని వెలుగు

గురువే విద్యార్థికి సమస్తం

హ్యాపీ టీచర్స్ డే!

3. తల్లి ప్రాణం ఇస్తుంది,

తండ్రి భద్రత ఇస్తాడు,

కానీ గురువు బతకడం నేర్పుతాడు.

హ్యాపీ టీచర్స్ డే 2024

4. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ్ మహేశ్వరః

గురు: సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

హ్యాపీ టీచర్స్ డే 2024

5. మనల్ని మనుషులుగా చేసి,

మంచి చెడులను గుర్తించే శక్తినిచ్చిని

దేశంలోని ఉపాధ్యాయులకు

మేము సెల్యూట్ చేస్తున్నాము

హ్యాపీ టీచర్స్ డే!

6. ఈ రోజు నేను రాయగలగడం, చదవగలగడం

నా గురువుగారి కృషి ఫలితమే

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

7. విద్యార్థి జీవితాన్ని సరైన దారిలో

పెట్టేది గురువు

ఆయన కొట్టినా తిట్టినా

తల్లిదండ్రుల తరువాత స్థానం టీచర్‌దే

హ్యాపీ టీచర్స్ డే

8. శిష్యుల ఎదుగుదలే

గురు దక్షిణగా భావించే

ఒకే ఒక్క వ్యక్తి ఉపాధ్యాయుడు

హ్యాపీ టీచర్స్ డే

9. ఎందరెందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది

తాను మాత్రం అదే స్థానంలో ఉంటూ ఆనందపడే వ్యక్తి ఉపాధ్యాయుడు

ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తరువాత స్థానం

గురువుదే

హ్యాపీ టీచర్స్ డే

10. ఉత్తమమైన వ్యక్తిని

రూపొందించడమే విద్య పరమార్థం

అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

11. ఈ ప్రపంచానికి

మీరు కేవలం ఉపాధ్యాయులే కావచ్చు

మాకు మాత్రం

మీరే ప్రేరణ

నాకు చదువుచెప్పిన ఉపాధ్యాయులందరికీ

టీచర్స్ డే శుభాకాంక్షలు

12. ఈ ప్రపంచంలో

ఎన్ని వందల ఉద్యోగాలు ఉన్నా

వారందరినీ తయారుచేసే

ఉద్యోగం మాత్రం ఉపాధ్యాయులదే

హ్యాపీ టీచర్స్ డే

టాపిక్