Teacher's day wishes: మీ జీవితాన్ని దిద్దిన గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి-happy teachers day 2024 best wishes for whatsapp and facebook status in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Teacher's Day Wishes: మీ జీవితాన్ని దిద్దిన గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

Teacher's day wishes: మీ జీవితాన్ని దిద్దిన గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

Koutik Pranaya Sree HT Telugu
Sep 04, 2024 03:00 PM IST

Teacher's day wishes: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మీ జీవితంలోని గురువులకు ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి. టీచర్స్ డే శుభాకాంక్షలు కూడా చెప్పండి.

టీచర్స్ డే శుభాకాంక్షల మెసేజ్‌లు
టీచర్స్ డే శుభాకాంక్షల మెసేజ్‌లు (shutterstock)

ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులది ప్రత్యేక పాత్ర. జీవితంలో మొదటి గురువు తల్లి. అక్కడినుంచి పాఠశాలలో మీకు విద్య నేర్పిన ప్రతి గురువు మీ జీవితంలో మీ ఎదుగుదలకు కారకులు. మనకు జ్ఞానాన్ని బోధించి, ముందుకు సాగడానికి సన్మార్గ బోధన చేసేది గురువు. మీ జీవితంలోని ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలపండి . భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు కూడా ఈ అందమైన సందేశాలను మీ ఉపాధ్యాయులకు, మీ జీవితంలో మీ ఎదుగుదలకు దారి చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపేయండి.

టీచర్స్ డే శుభాకాంక్షలు:

1. గురువు లేకపోతే జీవితం లేదు, గురువు ఆశీర్వాదంతోనే జీవితానికి సన్మార్గం దొరుకుతుంది. విజయవంతమైన జీవితానికి గురువే పునాది. హ్యాపీ టీచర్స్ డే

2. గురువు లేకుండా జ్ఞానం లేదు,

జ్ఞానం లేని ఆత్మ లేదు,

జ్ఞానం, సహనం, ధైర్యం

అన్నీ గురువు నేర్పించినవే.

హ్యాపీ టీచర్స్ డే

3.

సరైన మార్గదర్శకుడు ఉంటే

చిన్న దీపం కూడా సూర్యుడిలాగా ప్రకాశించగలదు

నా జీవితాన్ని దిద్దిన గురువు మీరే

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

4.

పూలదండ తయారు చేయడానికి ఎన్నో పూలు కావాలి

అందమైన ముగ్గు వేయడానికి మరెన్నో రంగులు కావాలి

కానీ పిల్లల జీవితాన్ని స్వర్గంగా మార్చడానికి

అసలైన ఉపాధ్యాయుడు ఒక్కరు చాలు

హ్యాపీ టీచర్స్ డే

5.

జీవితంలో వచ్చే ప్రతి చీకటిలో వెలుగు చూపేది గురువు

దారులన్నీ మూసుకుపోయినప్పుడు కొత్త మార్గం చూపేది గురువు

పుస్తకాలు చదవడమే కాదూ, జీవితాన్ని జీవించడం ఎలాగో నేర్పేది గురువు

హ్యాపీ టీచర్స్ డే

6.

మంచి గురువు పుస్తకం చూపి పాఠాలు చెప్పరు.హృదయంతో పిల్లలని అర్థం చేసుకుని బోధిస్తారు. నా జీవితంలో ఉత్తమ గురువు మీరే. హ్యాపీ టీచర్స్ డే సర్

7.

"ఒక పిల్లాడు, ఒక టీచర్, ఒక పుస్తకం, ఒక పెన్.. ప్రపంచాన్ని మార్చగలవు" – మలాలా

8.

మనం చేసిన తప్పులు మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. కానీ ఆ తప్పులే చేయకుండా ముందు దారి చూపేది ఉత్తమ గురువు. నా జీవితంలోని ప్రతి గురువుకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

9.

నీ స్నేహం నన్ను మంచి మనిషిగా మార్చింది

మనుషుల విలువలు నేర్పింది

తప్పులు చేయకూడని మార్గం చూపింది

మంచితనవ విలువ తెలిసేలా చేసింది

నా ప్రతి కష్టంలో నాకు మార్గదర్శకుడిగా ఉన్న నీకు హ్యాపీ టీచర్స్ డే. నువ్వే నా జీవితంలో ఉత్తమ గురువు.