Tofu Noodles Recipe। అన్నం తినాలనిపించకపోతే.. ఈ రుచికరమై టోఫు నూడుల్స్ తినండి!
Crispy Tofu Noodles Recipe: అన్నం తినాలనిపించడం లేదా? అయితే మీకోసం ఇక్కడ మీకు రుచికరమైన టోఫు నూడుల్స్ రెసిపీని అందిస్తున్నాము.
Crispy Tofu Noodles (istock)
Recipe of the day: మనకు ప్రతీసారి అన్నం తినాలనిపించదు, అప్పుడప్పుడు అన్నం కాకుండా వేరే ఏదైనా తినాలనిపిస్తుంది. ఈ సమయంలో మనకు గుర్తుకొచ్చేవి చపాతీలు లేదా చైనీస్ నూడుల్స్. చపాతీలు చేసుకోవడం పెద్ద ప్రక్రియ, కానీ నూడుల్స్ చాలా సులభంగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రుచికరమైన టోఫు నూడుల్స్ రెసిపీని అందిస్తున్నాము. ఈ టోఫు నూడుల్స్ పూర్తిగా శాకాహారం. ఇందులో వేసే టోఫు కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్ గా ఉండి, మీకు మంచి క్రంచీ రుచిని అందిస్తుంది.
టోఫు ఒక శాకాహార ప్రోటీన్ పదార్థం, దీనిని సోయాబీన్ నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి, అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇప్పుడైతే టోఫు నూడుల్స్ ఎలా చేసుకోవాలో ఈ కింద సూచనలు చదవండి.
Crispy Tofu Noodles Recipe కోసం కావలసినవి
- 150 గ్రాముల నూడుల్స్
- 400 గ్రాముల టోఫు క్యూబ్స్
- 1 క్యాప్సికమ్
- 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్
- 200 గ్రాముల బ్రోకలీ ముక్కలు
- 2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె
- రుచికి సరిపడా ఉప్పు
- 1/2 టేబుల్ స్పూన్ కాల్చిన నువ్వుల నూనె
- 1 టేబుల్ స్పూన్ సోయా సాస్
- 2 tsp చైనీస్ మసాలా పొడి
- 1 టేబుల్ స్పూన్ తేనె
క్రిస్పీ టోఫు నూడుల్స్ తయారీ విధానం
- ముందుగా నూడుల్స్ ఉడికించి, వడకట్టండి, వదులుగా చేసి పక్కన పెట్టండి.
- ఆ తర్వాత ఒక గిన్నెలో నువ్వుల నూనె, సోయా సాస్, మసాలా పొడి, తేనె కలపితే సాస్ తయారవుతుంది.
- ఇప్పుడు మీడియం మంట మీద ఒక కడాయిని వేడి చేసి, అందులో సగం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
- ఆపైన టోఫు క్యూబ్స్ వేసి ఐదు నిమిషాలు ఒక వైపు వేయించాలి, అన్ని వైపులా తిప్పుతూ టోఫు క్యూబ్స్ క్రిస్పీగా మారే వరకు కొన్ని నిమిషాలు వేయించి, ఆపై వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో మిగిలిన నూనెను వేడి చేసి, క్యాప్సికమ్ ముక్కలను ఒక నిమిషం పాటు ఉడికించి వేయించండి, ఆపై స్ప్రింగ్ ఆనియన్స్, బ్రోకలీని వేసి ఉడికే వరకు వేయించండి.
- ఇప్పుడు ఉడికించిన నూడుల్స్ వేయండి, ఆపై పైన చేసుకున్న డ్రెస్సింగ్ సాస్ వేసి బాగా కలపాలి.
- చివరగా, పైనుంచి క్రిస్పీ టోఫు క్యూబ్స్ వేసి, మిగిలిన డ్రెస్సింగ్ సాస్ వేసి కలపండి.
అంతే, క్రిస్పీ టోఫు నూడుల్స్ రెడీ. వేడివేడిగా ఆస్వాదించండి.
సంబంధిత కథనం