Gongura Royyala Curry: గోంగూర రొయ్యల కర్రీ రెసిపీ, ఆంధ్ర స్టైల్‌లో వండితే అదిరిపోతుంది-gongura royyala curry recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Royyala Curry: గోంగూర రొయ్యల కర్రీ రెసిపీ, ఆంధ్ర స్టైల్‌లో వండితే అదిరిపోతుంది

Gongura Royyala Curry: గోంగూర రొయ్యల కర్రీ రెసిపీ, ఆంధ్ర స్టైల్‌లో వండితే అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 22, 2023 11:07 AM IST

Gongura Royyala Curry: గోంగూర రొయ్యల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్రాలో దీన్ని ప్రత్యేకంగా వండుతారు.

గోంగూర రొయ్యల కర్రీ
గోంగూర రొయ్యల కర్రీ (youtube)

గోంగూర రొయ్యల కర్రీ రెసిపీ

Gongura Royyala Curry: ఆంధ్రాలో రొయ్యలతో చేసే వంటకాలు ఎంతో స్పెషల్. అందులో ప్రత్యేకమైనది పుల్ల పుల్లని గోంగూర రొయ్యల కర్రీ. దీన్ని అక్కడ రెస్టారెంట్లలో ప్రత్యేకంగా వండి వడ్డిస్తారు. ఇంట్లో కూడా దీన్ని టేస్టీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ గోంగూర రొయ్యల కర్రీ రుచి ఎలా ఉంటుంది. చిన్న రొయ్యలు లేదా పెద్ద రొయ్యలు ఎలాంటివి తీసుకున్నా కూడా ఈ కర్రీ రుచి బాగుంటుంది. పచ్చి రొయ్యలతో గోంగూర కలిపి ఎలా వండాలో తెలుసుకుందాం.

గోంగూర రొయ్యల కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

రొయ్యలు - అరకిలో

పసుపు - అర స్పూను

నూనె - ఆరు స్పూన్లు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - నాలుగు

యాలకులు - నాలుగు

జీలకర్ర - ఒక స్పూను

బిర్యానీ ఆకు - ఒకటి

కరివేపాకు - గుప్పెడు

ఉల్లిపాయ తరుగు - అరకప్పు

పచ్చిమిర్చి - మూడు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమాటో ముక్కలు - అర కప్పు

కారం - రెండు స్పూన్లు

జీలకర్ర పొడి - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

గోంగూర - రెండు కట్టలు

గరం మసాలా - ఒక స్పూను

నీళ్లు - తగినన్ని

ఉప్పు - రుచికి సరిపడా

గోంగూర రొయ్యల రెసిపీ తయారీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి రొయ్యలను వేయాలి. ఉప్పు, పసుపు కూడా వేసి చిన్న మంట మీద మగ్గించాలి.

2. రొయ్యల్లోని నీళ్లు కాస్త దిగి ఆవిరి అయిపోయాక, వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, కరివేపాకులు, యాలకులు వంటివి వేసి వేయించాలి.

4. పచ్చిమిర్చిని కూడా వేసి వేయించాలి. అవన్నీ వేగాక అందులో ఉల్లి తరుగును వేసి వేయించాలి.

5. ఉల్లిపాయల తరుగు లేత బంగారు రంగులోకి వచ్చేవరకు వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి.

6. టమోటా తరుగును వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కాసేపటికి టమోటాలు మెత్తగా అయ్యి గుజ్జులా తయారు అవుతాయి.

7. అప్పుడు కారం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. తగిననన్ని నీళ్లను వేయాలి.

8. ఈ లోపు ముందుగానే గోంగూర ఆకులను ఏరి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

9. ఆ గుజ్జును తీసి ఇప్పుడు ఉడుకుతున్న రొయ్యల్లో వేసి బాగా కలపాలి. అవసరమైతే తగినన్ని నీళ్లను వేసుకోవాలి.

10. చిన్న మంట మీద ఉంచి గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకులను కూడా వేసి కలపాలి.

11. పావుగంట సేపు దాన్ని ఎలా ఉడికిస్తే నూనె పైకి తేలుతుంది. 12. అంటే ఇక స్టవ్ కట్టేయచ్చని అర్థం.

13. ఈ గోంగూర రొయ్యల కర్రీని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

Whats_app_banner