Public toilet fear: పబ్లిక్ టాయిలెట్స్ వాడితే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని భయమా? అమ్మాయిలకు స్పెషల్ టిప్స్, గ్యాడ్జెట్లు-gadgets and tips to overcome urine infection from public toilets in female ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Public Toilet Fear: పబ్లిక్ టాయిలెట్స్ వాడితే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని భయమా? అమ్మాయిలకు స్పెషల్ టిప్స్, గ్యాడ్జెట్లు

Public toilet fear: పబ్లిక్ టాయిలెట్స్ వాడితే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని భయమా? అమ్మాయిలకు స్పెషల్ టిప్స్, గ్యాడ్జెట్లు

Koutik Pranaya Sree HT Telugu
Jun 25, 2024 06:50 PM IST

Public toilet fear: పబ్లిక్ టాయిలెట్లు వాడేటప్పుడు ఇన్ఫెక్షన్లు సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికోసం ప్రత్యేకంగా కొన్ని గ్యాడ్జెట్లు, టిప్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూడండి.

మహిళలను యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే గ్యాడ్జెట్లు
మహిళలను యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే గ్యాడ్జెట్లు

దూర ప్రయాణాలకు వెళ్తున్నామంటే అమ్మాయిలకు ముందుగా గుర్తొచ్చే ఇబ్బంది టాయిలెట్ల విషయంలోనే. బయటికి వెళ్లినప్పుడు మూత్ర విసర్జణ కోసం పబ్లిక్ టాయిలెట్లు వాడాలంటే భయంగా ఉంటుంది. అవి చూడ్డానికి శుభ్రంగా ఉన్నా లేకున్నా వాటివల్ల ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తాయేమో అని అనుమానంగా ఉంటుంది. మరి దానికి పరిష్కారం ఏదో ఒకటి ఉండాలిగా.. అవేంటో చూద్దాం..

పబ్లిక్ టాయిలెట్స్ వాడాల్సి వస్తుందని ఎక్కువ సేపు మూత్రానికి వెళ్లకుండా బిగబట్టుకుని ఉంటే ఏ సమస్యా రాదు అనుకోకూడదు. మూత్రం ఎక్కువసేపు బ్లాడర్‌లో ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు విసర్జణ చేయాల్సిందే. పబ్లిక్ టాయిలెట్లు వాడుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడే గ్యాడ్జెట్లున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

1. టాయిలెట్ సీట్ కవర్:

ఇప్పుడు బయట హోటళ్లలో, పబ్లిక్ టాయిలెట్లలో కూడా చాలా చోట్ల వెస్టర్న్ టాయిలెట్స్ ఉంటున్నాయి. వాటిమీద నేరుగా కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఈ టాయిలెట్ సీట్ కవర్ వాడితే ఆ ఇబ్బంది ఉండదు. ఈ కవర్ ను సీట్ మీద వేసి దానిమీద కూర్చుంటే చాలు. పని అయిపోయాక వాటిని మడిచి డస్ట్ బిన్‌లో వేసేయొచ్చు. ఇందులో వాటర్ ప్రూఫ్, నాన్ వాటర్ ప్రూఫ్ రకాలుంటాయి. ఏవైనా డిస్పోజ్ చేయొచ్చు. టాయిలెట్ సీట్ కవర్ అంటే పెద్దగా ఉంటుందీ అనుకోకండి. దాన్ని తీసుకెళ్లడం చాలా సులభం. చిన్న ప్యాకెట్లో 5 నుంచి 10 టాయిలెట్ సీట్ కవర్లు పట్టేలాగా వీటి ప్యాకింగ్ ఉంటుంది. చిన్న పర్సులో కూడా ఈ ప్యాకెట్ పట్టేస్తుంది. మీతో పాటూ బాత్రూంలోకి సులభంగా తీసుకెళ్లొచ్చు.

2. టాయిలెట్ సీట్ శానిటైజర్:

టాయిలెట్ వాడే ముందు స్ప్రే రూపంలో ఉంటే టాయిలెట్ సీట్ శానిటైజర్ వాడాలి. పబ్లిక్ టాయిలెట్ వాడేటప్పుడు తలుపుకుండే హ్యాండిల్, వాష్ బేసిన్ కుళాయి.. ముట్టుకోవాలన్నా ఆలోచిస్తాం. అలాంటప్పుడు కూర్చునే సీట్ మీద, హ్యాండ్ పంప్ మీద, ఫ్లష్ బటన్ మీద, బాత్రూం హ్యాండిల్, కుళాయి.. ఇలా మీరు ముట్టుకునే ప్రతి వస్తువు మీద ఒకసారి దీన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఒక నిమిషం ఆగితే టాయిలెట్ ఏ భయం లేకుండా వాడుకోవచ్చు.

3. ఫీమేల్ యూరినేషన్ డివైస్:

ఇది అమ్మాయిలు కూడా అబ్బాయిల్లాకా నిలబడి మూత్ర విసర్జన చేసేలాగా తయారు చేసిన సింపుల్ పరికరం. దీంతో టాయిలెట్ సీట్ మనకు తాకదు. ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉండదు. దీన్ని ఉపయోగించి నిలబడే మూత్ర విసర్జణ చేయొచ్చు. స్టాండ్ అండ్ పీ, ఫీమేల్ యూరినేషన్ డివైస్.. పేరుతో ఇవి దొరుకుతాయి. ఇవి పేపర్ తో తయారు చేస్తారు. చూడ్డానికి ఫనెల్ లాగా ఉంటుంది. దాన్ని ముందు పెట్టుకుని వాడుకోవడమే. పని అయ్యాక ఫ్లష్ లో వేసేయొచ్చు. లేదా డస్ట్ బిన్ లో వేసేయొచ్చు. ఇవి కూడా చాలా చిన్నగా ఉండి పర్సులో పెట్టుకోవచ్చు. వీటిలో రీయూజబుల్ రకాలు కూడా ఉంటాయి.

అవసరం బట్టి గ్యాడ్జెట్స్ వాడటంతో పాటే.. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...

1. వీలైనంత వరకు ఇండియన్ టాయిలెట్స్ వాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీటివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువ.

2. ప్రయాణాల్లో నీళ్లు ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగుతూ హైడ్రేటెడ్ గా ఉంటే తప్పనిసరిగా టాయిలెట్ వాడాల్సిన పరిస్థితి రాదు.

3. ఇంటి నుంచి లేదా హోటల్ నుంచి బయలుదేరే ముందు తప్పకుండా ఒకసారి మూత్ర విసర్జణ చేయాలి.

 

WhatsApp channel