Urination More At Night : రాత్రి ఎక్కువగా మూత్ర విసర్జన వస్తుందని ఆందోళన చెందుతున్నారా? నోక్టురియా వృద్ధాప్యంలో సాధారణంగా ఉంటుంది. యువకుల్లో కూడా ఈ సమస్య ఉంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోండి.   

pexels

By Bandaru Satyaprasad
Feb 25, 2024

Hindustan Times
Telugu

రాత్రిపూట ఒకటి కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన వస్తుంటే.. మూత్రాశయ సమస్యలు, నిద్ర లేమి, జీవనశైలి, కొన్ని అలవాట్లు కారణాలు కావొచ్చు.   

pexels

నోక్టురియా నిద్ర సమస్యకు దారితీస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యుడి సలహాలతోపాటు జీవన ప్రమాణాల్లో మార్పులు తప్పనిసరి.   

pexels

 నోక్టురియా తగ్గించడానికి మితమైన వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు సూచించారు. నిద్రకు ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకుంటే  యూరిన్ ఎక్కువగా వస్తుంది. వీటిని నియంత్రించాల్సి ఉంటుంది.   

pexels

కొన్ని వైద్య, మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా నోక్టురియాతో సంబంధం ఉంటాయి. ఆందోళన, డిప్రెషన్, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గర్భం మూత్ర అంటువ్యాధులు అధిక యూరిన్ కు దోహదం చేస్తాయి. 

pexels

జీవనశైలిలో మార్పులు చేయడం నోక్టురియా సమస్యను తగ్గిస్తుంది. మీరు రాత్రిపూట మూత్ర విసర్జన సంఖ్యను తగ్గించడానికి ఇవి ప్రయత్నించండి.  

pexels

మధ్యాహ్నం నిద్ర మానుకోండి. రాత్రి నిద్ర ముందు 20-30 నిమిషాలు మ్యూజిక్, యోగా, శ్వాస వ్యాయామాలు, చదవడం లేదా వెచ్చని నీటితో స్నానం చేయడం వంటి రిలాక్సింగ్  టిప్స్ పాటించండి.  

pexels

రాత్రి భోజనం తర్వాత కాసేపు శారీరక శ్రమ చేయండి. కొద్దిసేపు నడవడం మంచిది. నిద్రవేళకు ముందు కెఫిన్ పానీయాలు, ఆల్కహాల్‌ను తగ్గించండి.   

pexels

నిద్ర సమయానికి రెండు గంటల ముందు పానీయాలు తాగడం తగ్గించండి. స్మోకింగ్ మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. రాత్రి భోజనం తర్వాత స్మోకింగ్ చేయడం తగ్గించండి. మీ ఆహారంలో ఉప్పు, ప్రోటీన్లను తగ్గించండి.  

pexels

జీవిత సమస్యల ఆలోచనలను తగ్గించుకోండి. పగటిపూట సంఘటనలను ఒకసారి పునశ్చరణ చేయడం నిద్రపోవడానికి సహాయపడవచ్చు. మీ బెడ్ ను నిద్ర పోవడానికి, లైంగిక కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించండి. 

pexels

డయాబెటిస్ ఉన్న వారు క్వినోవా తినొచ్చా? ప్రభావం ఎలా..

Photo: Unsplash