గుమ్మడి గింజలు ఎలా తింటే మేలు?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 16, 2024

Hindustan Times
Telugu

గుమ్మడికాయల్లోని గింజలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో ప్రొటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన విటమిన్లు సహా చాలా పోషకాలు ఉంటాయి. 

Photo: Pexels

గుమ్మడి గింజల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, వీటిని ఎలా తింటే మేలు అనే ప్రశ్న కొందరిలో ఉంటుంది. ఆ సమాధానం ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ముందుగా గుమ్మడి గింజలను నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీరంతా ఆరిపోయేలా చేయాలి. తేమ ఆరిపోయాక గుమ్మడి గింజలను ఫ్రై చేసుకోవాలి.

Photo: Pexels

వైద్య నిపుణుల ప్రకారం, గుమ్మడి గింజలను ఫ్రై చేసుకొని తింటే శరీరానికి పోషకాలు మెండుగా అందుతాయి. కావాలంటే వేయించిన గుమ్మడి గింజలను పెరుగు, స్మూతీలు, పండ్లలోనూ కలుపుకొని కూడా తినొచ్చు. ఇవి మంచి టేస్ట్ అందిస్తాయి. శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. 

Photo: Pexels

గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. క్యాలరీలు, విటమిన్స్ ఉండడం వల్ల ఎనర్జీ కూడా బాగా పెరుగుతుంది. 

Photo: Pexels

గుమ్మడి గింజల వల్ల ఎముకల దృఢత్వం కూడా పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. జీర్ణక్రియకు కూడా ఈ గింజలు మేలు చేస్తాయి. 

Photo: Pexels

జుట్టును మెరుగ్గా ఉంచే కాపర్ అధికంగా ఉండే ఫుడ్స్ ఇవి