Upset Stomach Remedies । కడుపులో నొప్పి, అసౌకర్యంగా ఉందా? పరిష్కార మార్గాలు చూడండి!
Upset Stomach Remedies: కడుపు నొప్పి, అజీర్తి మొదలైన సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేస్తే ఉపశమనం లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత రోజు నుంచి దాని సైడ్ ఎఫెక్టులు మొదలవుతాయి. కడుపులో మంట, అజీర్తి, వికారం మొదలైన సమస్యలతో చాలా ఇబ్బంది పడతారు. అతిగా తినడం, మసాలా ఆహారం ఎక్కువ తీసుకోవడం, కార్బోనేటేడ్ పానీయాలు ఎక్కువ తాగేయడం వలన ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఆల్కాహాల్ సేవించడం వలన హ్యాంగోవర్ కూడా ఉంటుంది. ఇది కాకుండా చలికాలంలో చాలామంది కడుపు నొప్పి గురించి కూడా తరచుగా ఫిర్యాదు చేస్తారు. సాధారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయినపుడు కొందరిలో తేలికపాటి కడుపు నొప్పి, కడుపు తిమ్మిరిగా అనిపిస్తుంది. దీనికి తోడు ఆహరపు అలవాట్లు కడుపులో గందరగోళం సృష్టిస్తాయి. అన్ని రకాల జీర్ణ సమస్యలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే.
మీ శరీరానికి సరికాని ఆహారం తీసుకున్నప్పుడు వికారం, ఉబ్బరం, గుండెల్లో మంటను అనుభవించవచ్చు. పెద్ద మొత్తంలో తినడం వల్ల మీకు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే, అధికంగా ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు , జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదనపు చక్కెరను కలిగి ఉన్న ఆహారం వలన గ్యాస్ ఎక్కువ తయారవుతుంది. అధిక కొవ్వు కలిగిన ఆహారం తిన్నప్పుడు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, గ్యాస్‌కు కారణమవుతుంది.
Upset Stomach Remedies- కడుపులో అసౌకర్యానికి పరిష్కార మార్గాలు
కడుపు నొప్పి, అజీర్తి మొదలైన సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేస్తే ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు తాగండి
మీరు తీసుకునే ఆహారాలు , పానీయాల నుండి పోషకాలను సమర్థవంతంగా జీర్ణం చేయడానికి, గ్రహించడానికి శరీరానికి నీరు అవసరం. నిర్జలీకరణం జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తుంది. ఇది కడుపు నొప్పి, అజీర్తి మొదలైన ఉదర సమస్యల సంభావ్యతను పెంచుతుంది. అందువల్ల పుష్కలంగా నీరు త్రాగటం అవసరం. నీరు బాగా తాగితే అది గుండెల్లో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకి 5 లీటర్లు నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తారు.
సరైన ఆహారం
భోజనంలో పెరుగు తీసుకోండి. పెరుగు మంచి ప్రోబయోటిక్ , ఇది కడుపులో అదనపు యాసిడ్ ఉత్పత్తి, గ్యాస్, ఉబ్బరానికి కారణమయ్యే అనారోగ్య బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది. అలాగే ఒక కప్పు అల్లం టీ తాగవచ్చు, అల్లంలో ఉండే ఫైటోకెమికల్స్ కారణంగా అజీర్ణం, కడుపు నొప్పి, వికారం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అజీర్తికి బొప్పాయి గొప్ప ఔషధం. మీ ఆహారంలో బొప్పాయి పండును చేర్చుకోండి.
డయేరియా ఉన్నవారికి వైద్యులు BRAT డైట్‌ని సిఫారసు చేయవచ్చు. BRAT అంటే బనాన, రైస్, యాపిల్, టోస్ట్ అని సూచిస్తుంది.
పడుకోకూడదు
కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిదే కానీ, పడుకోకూడదు. పడుకోకుండా ఉండటం వల్ల అజీర్ణం గుండెల్లో మంటగా మారకుండా నిరోధించవచ్చు. సమాంతరంగా పడుకున్నప్పుడు, కడుపులోని ఆమ్లం వెనుకకు ప్రయాణించి పైకి కదిలే అవకాశం ఉంది, ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది. కాబట్టి కడుపు నొప్పి అనుభవిస్తున్నప్పుడు కనీసం కొన్ని గంటల పాటు పడుకోవడం మానుకోవాలి.ఈ ఆహారాలు విరేచనాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు చప్పగా తీసుకోవాలి. కాబట్టి అవి కడుపు, గొంతు లేదా ప్రేగులకు చికాకు కలిగించవు.
ఒత్తిడిని దూరంగా ఉంచండి
ఒత్తిడి జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, యోగా, ధ్యానం లేదా నడక వంటి ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి.
ధూమపానం, మద్యపానం చేయవద్దు
ధూమపానం, మద్యపానం అజీర్ణం, జీర్ణశయాంతర రిఫ్లక్స్ వ్యాధి (GERD) వంటి ఇతర జీర్ణక్రియ పరిస్థితులను ప్రేరేపిస్తాయి. అందువల్ల కడుపునొప్పి ఉన్నప్పుడు . ధూమపానం, మద్యపానం చేస్తే సమస్య మరింత తీవ్రం అవుతుంది.
టాపిక్