స్నేహం ఓ వరం.. మీ స్పేహ బంధం బలంగా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి!-friendship day 2022 how to maintain good bonding with friends ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  స్నేహం ఓ వరం.. మీ స్పేహ బంధం బలంగా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి!

స్నేహం ఓ వరం.. మీ స్పేహ బంధం బలంగా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి!

Rekulapally Saichand HT Telugu
Aug 07, 2022 12:03 PM IST

స్నేహం ఒక తీయని జ్ఞాపకం. జీవిత ప్రయాణంలో స్నేహ బంధానికి మించింది లేదు. బాల్య దశలో బలపడే స్నేహం చివరకు వరకు కొనసాగాలంటే బంధంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

friendship day 2022
friendship day 2022

సమాజంలోని ప్రతి మనిషి ఏదో ఒక సంబంధానికి కట్టుబడి ఉంటాడు. పుట్టినప్పటి నుండి జీవిత ప్రయాణంలో అనేక బంధాలు, అనుబంధాలు ఎదురవుతాయి. కుటుంబ పరంగా తాతలు, మామయ్య, తల్లితండ్రులు, తోబుట్టువులతో సహా అనేక సంబంధాలు వ్యక్తి చుట్టూ తిరుగుతాయి. అయితే ఇవన్ని పుట్టుకతో, కుటుంబంతో ఒక వ్యక్తికి ఏర్పాడే బంధాలు. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయిన ఓ బంధంతో అమితమైన ప్రేమ, ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఈ సంబంధం ఎల్లప్పుడూ మీకు అండగా నిలుస్తుంది. మీ బాధను దూరం చేస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అదే స్నేహ బంధం. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుడు తప్పనిసరిగా ఉంటాడు. ఇలాంటి స్నేహ బంధాన్ని చాటడానికి ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా అంకితం చేయబడింది. ఈ సంవత్సరం ఫ్రెండ్‌షిప్ డే అంటే ఆగస్టు 7న ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటున్నారు. మరి ఇలాంటి స్నేహ బంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాకుండా ఎల్లకాలం కొనసాగాలంటే, ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

స్నేహితుడితో అబద్ధం చెప్పకండి

స్నేహం నమ్మకంతో నిర్మించబడింది. కాబట్టి స్నేహం మొదటి నియమం అబద్ధాల నుండి దూరంగా ఉండడం. స్నేహితుడికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎవరితోనైనా స్నేహం చేస్తున్నప్పుడు, స్నేహం మధ్యలో అబద్ధాలు రావడాన్ని మీరు ఎప్పటికీ అనుమతించరని మీకు మీరే వాగ్దానం చేసుకోండి. సంబంధంలో అబద్ధాలు చెప్పినప్పుడు,బంధం విచ్చిన్నం అవుతుంది.

డబ్బును స్నేహానికి దూరంగా ఉంచండి

సంబంధం నిస్వార్థంగా ఉండాలి. స్నేహితుడి నుండి ఎప్పుడూ ప్రయోజనం పొందాలని ఆశించవద్దు. మీకు ఆర్థిక సహాయం అవసరం కావచ్చు, కానీ స్నేహంలోకి డబ్బు తీసుకురావద్దు. ఎందుకంటే మీరు మీ అవసరాల కోసం స్నేహితుడి డబ్బుపై ఆధారపడటం ప్రారంభించినప్పుడు, స్నేహం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది.

విషయాలు దాచవద్దు

చాలా మంది దొస్తులు తమ హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకుంటారు. కానీ మీరు స్నేహితుడి నుండి విషయాలను దాచడం ప్రారంభించినప్పుడు, సంబంధంలో దూరం రావడం ప్రారంభమవుతుంది. మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్ గురించి విషయాలను దాచడం వంటివి. ఒక స్నేహితుడు మీ గురించి మరొకరి నుండి తెలుసుకున్నప్పుడు, స్నేహంలో దూరం రావడం ప్రారంభమవుతుంది.

స్నేహితుడికి సహాయం చేయడంలో వెనుకడుగు వేయకండి

కష్టసుఖాలలో స్నేహుతుడికి మద్దతు ఇవ్వడం స్నేహంలో ఉన్న మెుదటి అర్ధాలలో ఒకటి. అటువంటి పరిస్థితిలో, స్నేహితుడికి మీరు అవసరం ఉన్నప్పుడు, సహాయం చేయడంలో వెనక్కి తగ్గకండి. మీరు వారికి సాధ్యమైన విధంగా సహాయం చేస్తానని స్నేహితుడికి వాగ్దానం చేయండి. ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. స్నేహితుడికి సహాయం చేయడానికి మీకు తగినంత వనరులు లేకపోవచ్చు, కానీ మీ స్నేహితుడికి మానసికంగా బలహీనంగా, ఒంటరిగా అనిపించేలా చేయవద్దు. మీ స్పష్టమైన ఉద్దేశాలు స్నేహాన్ని బలపరుస్తాయి. సహాయం పేరుతో స్నేహితుడిని విస్మరించడం స్నేహానికి ముగింపుకు దారి తీస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం