Friday Motivation : నలుగురికి మనం నచ్చాలని రూల్ లేదు బాసు.. ఓ కంగారు పడిపోమాకు..-friday motivation on before you ask why someone hates you ask yourself why you even care ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : నలుగురికి మనం నచ్చాలని రూల్ లేదు బాసు.. ఓ కంగారు పడిపోమాకు..

Friday Motivation : నలుగురికి మనం నచ్చాలని రూల్ లేదు బాసు.. ఓ కంగారు పడిపోమాకు..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 04, 2022 06:24 AM IST

Friday Motivation : మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారంటే ప్రాబ్లం మనది కాదు.. వాళ్లది. కాబట్టి వాళ్లు ఎందుకు ద్వేషిస్తున్నారో అనే ప్రశ్నను వదిలేసి.. మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి. మీ ఆలోచనలు మీరే ఆలోచించి.. వాళ్ల ఆలోచనల గురించి కూడా మీరే ఆలోచిస్తే.. బుర్ర హీటెక్కిపోద్ది.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : మనం కొందరికి నచ్చుతాం. కొందరికి నచ్చము. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. అలాగే మనకు కొందరు నచ్చుతారు. కొందరు నచ్చరు. మనకు నచ్చనివాళ్లు ఎలా ఉంటారో.. మనం అంటే గిట్టని వాళ్లు కూడా అలానే ఉంటారు. ఎప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. ఎదుటివారికి నచ్చినట్లు బతకడానికి కాదు మీకు లైఫ్ ఉన్నది. మీకు మీరు నచ్చినట్లు బతకడానికి మాత్రమే. మనవల్ల ఎదుటివారికి ఇబ్బంది కలగనంతవరకు మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి.

మీవల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే.. వారికి దూరంగా ఉండండి. అంతే కానీ వాళ్లకి నేను ఎందుకు నచ్చలేదు. వాళ్లు నా గురించి ఏమి ఆలోచిస్తున్నారు. వాళ్లు నా నుంచి ఏమి కోరుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటే మీరు కనీసం అడుగు కూడా ముందుకు వేయలేరు. మిమ్మల్ని మీరు హ్యాపీగా చూసుకోవాలనుకుంటే.. మీకు నచ్చినది చేయండి. ఓ మనిషి ఎంత పర్​ఫెక్ట్​గా ఉన్నా.. అందరికీ నచ్చాలని రూల్ లేదు. సో వాళ్లు ఏమనుకుంటున్నారు. వీళ్లు ఏమనుకుంటున్నారు అనే విషయాలు పక్కన పట్టండి. మీరంటే ఇష్టముండే వాళ్లతో టైం స్పెండ్ చేయండి. లేదంటే సెల్ఫ్ గ్రూమింగ్​కి ప్రిఫరెన్స్ చేయండి.

ఎదుటి వాళ్లకి నచ్చకపోతే ఆ తప్పు మనది కాదు. వాళ్లది అనుకోండి. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నాను అంటే నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు అని అడగడం కాదు. వాళ్లు నన్ను ఎందుకు ఇష్టపడాలి అని ప్రశ్నించుకోండి. మీ అంగీకారం, మీ ప్రేమ, మీ ఇష్టాలే మిమ్మల్ని ఆనందగా ఉంచుతాయి. ఎవరో ఇష్టపడాలి. ఏదో చేయాలి అంటే ఏమి జరగదు. మీ రాతను మీరే రాసుకోవాలి. మీ గీతలు మీరే గీసుకోవాలి. ఇతరుల మెప్పు పొందాలనే ప్రయత్నాలు ఆపేయండి.

ఈ ప్రపంచం అంతా పూర్తిగా విమర్శకులతో నిండి ఉంటుంది. ఇంట్లోని వాళ్లకే మీరు చేసే పనులు నచ్చకపోవచ్చు. అన్నని చూసి నేర్చుకో.. తమ్ముడిని చూసి నేర్చుకో.. అలా ఇలా అని కంపేర్ చేస్తూ తిడతారు. అలాంటిది బయటవాళ్లకి మనం నచ్చాలని రూల్ లేదు కదా. మీరు ఎంతగా కష్టపడినా.. కొందరు మిమ్మల్ని ఎప్పటికీ అభినందించరు. మీ కష్టాన్ని గుర్తించరు. అలాంటివారికోసం కష్టపడటం మానేయండి. మిమ్మల్ని ఇష్టపడనివారి ఆలోచనలు మార్చడానికి ప్రయత్నించకండి. బదులుగా మీపై మీ ఇష్టాన్ని పెంచుకోండి. కొందరు మనలోని లోపాలను ఎంచడానికే దేవుడు వాళ్లని పుట్టించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ అదే పనిలో ఉంటారు. అలాంటి వారి మాటలపై శ్రద్ధ చూపించకండి. అవి మీకు అనవసరం. సెల్ఫ్ లవ్ ఎప్పుడూ మంచిదే అని గుర్తు పెట్టుకోండి. అన్ కండీషనల్​గా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం