Green Mussels । ఆకుపచ్చని మస్సెల్స్ తిన్నారా? రుచిలో అద్భుతం, పోషకాలు ఘనం!
Green Mussels Health Benefits: సీఫుడ్ అంటే ఇష్టపడేవారికి ఆకుపచ్చని మస్సెల్స్ మరొక గొప్ప ఆహార ప్రత్యామ్నాయం. ఇవి రుచికరమైనవే కావు, ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా.
మీకు సీఫుడ్ అంటే ఇష్టమా? చేపలు, రొయ్యలు, పీతలు మాత్రమే కాకుండా సీఫుడ్ లో చాలా రకాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గ్రీన్ మస్సెల్స్ తిన్నారా? ఇవి ఒక రకమైన షెల్ఫిష్, వీటిని పెర్నా కెనాలిక్యులస్ అని కూడా పిలుస్తారు. నత్తగుల్లలు, ఆల్చిప్పలలో ఇవీ ఒక రకం. గ్రీన్ మస్సెల్స్ ప్రత్యేక రుచిని కలిగి ఉండటమే కాకుండా, పోషకాలతో కూడా నిండుగా ఉంటాయి. అందుకే వీటిని శతాబ్దాలుగా ఆహారంగా వినియోగిస్తూ వస్తున్నారు. అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్ మస్సెల్స్ కు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది.
గ్రీన్ మస్సెల్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్ మస్సెల్స్ తినడం ద్వారా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కణజాలాలను బలోపేతం చేస్తుంది, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
Green Mussels Health Benefits-ఆకుపచ్చని మస్సెల్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
నిపుణుల ప్రకారం ఆకుపచ్చని మస్సెల్స్ తినడం ద్వారా మరెన్నో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందులో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.
1. ఆస్టియో ఆర్థరైటిస్
ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ లక్షణాలలో గణనీయమైన తగ్గింపు ఉంటుంది. కీళ్లలో పటుత్వం, చలనశీలత మెరుగుపడుతుంది.
2. పేగు ఆరోగ్యం
ఆకుపచ్చ మస్సెల్స్‌లోని సమ్మేళనాలు మన గట్ ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలవు. ఇందులో ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రీబయోటిక్స్ (ఇనులిన్ వంటి ఫైబర్-రిచ్ ఫుడ్స్) మన గట్‌లో ఇప్పటికే ఉన్న బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి, అయితే ప్రోబయోటిక్స్ (కొన్ని పాల ఉత్పత్తులు, ఊరగాయ కూరగాయలు) గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం మెరుగుపరుస్తాయని అనేక పరిశోధన అధ్యయనాలు నిరూపించాయి. ఈ రెండు సమ్మేళనాలు గ్రీన్ మస్సెల్స్ తినడం ద్వారా పొందవచ్చు.
3. ఆస్తమా తగ్గుముఖం
ఆస్తమా ఉన్నవారు గ్రీన్ మస్సెల్స్ క్రమం తప్పకుండా తినడం వలన వారి ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోతాయి, ఆరోగ్యం క్రితం కంటే మెరుగ్గా ఉంటుంది.
4. మెరుగైన రక్త ప్రసరణ
ఆకుపచ్చ మస్సెల్స్‌లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రవాహాన్ని, ధమనుల గోడల బలాన్ని మెరుగుపరచడంలో కూడా పాత్ర పోషిస్తాయి, ఇది ముఖ్యమైన అవయవాలు, కండరాలకు ఆరోగ్యకరమైన ప్రసరణను అనుమతిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది.
5. రక్తహీనతను నివారణ
మస్సెల్స్ లో ఇనుము పుష్కలంగా లభించే ఒక మూలకం. ఆక్సిజన్-వాహక ప్రోటీన్లు హిమోగ్లోబిన్ , మయోగ్లోబిన్ ఉత్పత్తిలో ఇనుము ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది
6. యాంటీఏజింగ్ లక్షణాలు
ఆకుపచ్చ మస్సెల్స్ మ్యూకోపాలిసాకరైడ్‌లను కలిగి ఉంటాయి, ఇవి వయస్సును తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. మృదువైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడంలో సహాయపడతాయి.
సంబంధిత కథనం