Weight Loss Tips : డెస్క్ జాబ్​తో బరువు సమస్యలా? అయితే వీటిని ఫాలో అయిపోండి..-follow these simple tips to loss weight at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss Tips : డెస్క్ జాబ్​తో బరువు సమస్యలా? అయితే వీటిని ఫాలో అయిపోండి..

Weight Loss Tips : డెస్క్ జాబ్​తో బరువు సమస్యలా? అయితే వీటిని ఫాలో అయిపోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 24, 2022 11:21 AM IST

ఆఫీసులో లేదా ఇంటి నుంచి ఎక్కువసేపు కూర్చొని చేసే పనులు బరువు పెరగడానికి అతిపెద్ద కారణమవుతున్నాయి. శారీరక శ్రమ లేకుండా 8-10 గంటలు పనిచేయడం వల్ల బరువు పెరుగుతున్నారని కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి. అటువంటి పరిస్థితిల్లో వ్యాయామం, జిమ్ కోసం సమయాన్ని వెచ్చించడం కూడా కష్టమవుతుంది. అయితే పెరుగుతున్న బరువును నియంత్రించుకోవడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వండి.

<p>చిన్న చిట్కాలతో మార్పులు</p>
చిన్న చిట్కాలతో మార్పులు

Weight Loss Tips : 8-10 గంటల ఉద్యోగంతో బరువు పెరగడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? అయితే బరువు తగ్గడానికి మీరు హార్డ్‌కోర్ వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ డైట్ ప్లాన్‌లో కొద్దిగా మార్పులు చేస్తూ.. తేలికపాటి వ్యాయామాలతో మీరు ఫిట్​గా, ఆరోగ్యంగా మారిపోవచ్చు. అయితే ఆ మార్పులేమిటో, డైట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి అరగంటకు విరామం

ఇక్కడ విరామం అంటే ప్రతి అరగంటకోసారి టీ, అల్పాహారం సేవించమని కాదు. అరగంటకు విరామం అంటే.. మీరు మీ సీటులోంచి లేచి కొంచెం నడవాలి. ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఉద్యోగంతో పాటు ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే కచ్చితంగా ఈ విరామం తీసుకోండి.

లోతైన శ్వాసలు అవసరం

గుండె, మనస్సును ఫిట్‌గా ఉంచుకోవడానికి లోతైన శ్వాసలు తీసుకోవడం అవసరం. కాబట్టి పని మధ్యలో లోతైన దీర్ఘ శ్వాసలను తీసుకుంటూ ఉండండి. ఇది శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చేస్తుంది.

టీ, కాఫీ తగ్గించేయండి..

పని చేసే సమయంలో బద్ధకం మామూలే. కానీ.. దాన్ని పోగొట్టుకోవడానికి టీ, కాఫీలు మళ్లీ మళ్లీ తాగాలని కాదు. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. వాటికి బదులుగా.. మీరు కొన్ని ఆరోగ్యకరమైన, డిటాక్స్ పానీయాలను తీసుకోవచ్చు. వాటితో మీరు కూడా రిఫ్రెష్ అవుతారు.

ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోండి..

బరువు తగ్గాలనుకుంటే ముందు చేయాల్సిన పనుల్లో మొదటిది ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడం. ఆఫీసులో ఉన్నా, ఎక్కడికివెళ్లిన ఇంట్లో వండిన ఆహారాన్నే తినడానికి ప్రయత్నించండి. బయట వండే ఆహారాలను సాధ్యమైనంత వరకు దూరం పెట్టండి. మీ లంచ్ బాక్స్‌లో ఆరోగ్యకరమైన, పోషకాలున్న ఆహారాన్ని తీసుకోండి. దీనితో పాటు మీరు తప్పనిసరిగా కొన్ని పండ్లు లేదా గింజలను మీ డైట్​లో చేర్చుకోవాలి.

కుర్చొని పనిచేయండి..

చాలా మంది పనిలో ఉన్నప్పుడు కుర్చీపై కూర్చుంటారు. కొందరు పడుకునే పనిచేస్తారు. ఇలా చేయడం వల్ల కొంత కాలం ఉపశమనం పొందవచ్చు కానీ శరీరానికి మంచిది కాదు. మీరు కూర్చొని పని చేస్తూనే.. చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ కుర్చీపై నేరుగా కూర్చోండి. ఇది మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. అంతేకాకుండా పొట్ట వద్ద కొవ్వును పెంచదు.

Whats_app_banner

సంబంధిత కథనం