Constipation Remedies: మలబద్ధకంతో ఇబ్బందా? తేలికగా తగ్గించుకోవచ్చిలా..-follow these natural home remedies for constipation ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Follow These Natural Home Remedies For Constipation

Constipation Remedies: మలబద్ధకంతో ఇబ్బందా? తేలికగా తగ్గించుకోవచ్చిలా..

HT Telugu Desk HT Telugu
Sep 21, 2023 10:00 AM IST

Constipation Remedies: మలబద్దకం సమస్య ఇబ్బంది పెడుతుంటే తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటూ.. కొన్ని చిట్కాలు పాటించండి. వెంటనే ఫలితం ఉంటుంది.

మలబద్ధకం తగ్గించే మార్గాలు
మలబద్ధకం తగ్గించే మార్గాలు (pexels)

ప్రతి మనిషీ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుంటాడు. కానీ కొందరు మాత్రం ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల పొట్టలో తలెత్తే సమస్యలు ఎన్నో. వాటిల్లో ప్రధానమైనది మల బద్ధకం. దీని వల్ల పేగులు సరిగ్గా శుభ్ర పడవు. దీంతో కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, గ్యాస్‌, ఆయాసం, ముఖంపై మొటిమలు, దద్దుర్లు, వాంతులు, జలుబు, తలనొప్పి, ఎద భాగం పట్టేసినట్లు ఉండటం, తేనుపులు లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఇబ్బంది ఉన్న వారు కొన్ని చిట్కాలను పాటిస్తే దీని నుంచి బయట పడగలుగుతారు.

ట్రెండింగ్ వార్తలు

మలబద్ధకం తగ్గించే చిట్కాలు:

  • పరగడుపున అర లీటరు వరకూ గోరు వెచ్చటి నీళ్లు తాగండి. రోజూ రెండు, మూడు గ్లాసుల మజ్జిగ తాగండి. అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు ద్రవ రూపంలో ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
  • పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు కాకుండా పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న వాటిని తినాలి.
  • బెల్లం పొడి, నెయ్యిలను సమ భాగాలుగా తీసుకోండి. రెండింటినీ కలిపి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తినండి. బెల్లంలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. నెయ్యిలో మనకు అవసరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఇవి రెండూ కలిపి తినడం వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలూ బయటకు వెళ్లిపోతాయి. దీన్ని క్రమం తప్పకుండా రోజూ తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగై మలబద్ధకం దూరమవుతుంది.
  • సాయంత్రం చిరు తిండి తినే అలవాటు అందరికీ ఉంటుంది. ఈ సమస్య ఉన్న వారు మాత్రం ఏదో ఒక మెలాన్‌ని తినేందుకు ప్రయత్నించండి. అంటే పుచ్చ, కర్భూజ, దోస.. లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. సాయంత్రం మూడు, నాలుగింటి సమయంలో వీటిని తినడం వల్ల శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వీటి వల్ల అనేక పోషకాలూ దానికి అందుతాయి.
  • రాత్రి భోజనం సమయంలో నువ్వుల పొడిని తీసుకోండి. దీనిలో ముఖమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం, విటమిన్‌ ఈ లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ తిన్నది సరిగ్గా జీర్ణం కావడానికి సహకరిస్తాయి. ఒక వేళ మీరు భోజనం చేయకుండా రాగి రొట్టె, జొన్న రొట్టె, చపాతీ లాంటి వాటిని తింటున్నా తయారు చేసుకునేప్పుడు కాస్త నువ్వుల పొడిని ఆ పిండిలో కలిపేయండి. ఇలా చేయడం వల్ల పేగు

WhatsApp channel